
కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎలా, ఎం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఇక పనికి రాను అనుకున్న నేతను అందలం ఎక్కిస్తారు. బడా నేత గాలి తీసి… డమ్మీని చేస్తారు. ఇదీ ఈనాటి నుండి కాదు… ఇందిరాగాంధీ హయం నుండి కాంగ్రెస్ కు మాత్రమే అలవాటైన రాజకీయం. సరే ఇక విషయానికి వస్తే…తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం, ఎన్నో రోజులు కసరత్తులు చేసి మరీ ప్రచార కమిటీని వేసింది. రేవంత్ కు ప్రచారకమిటీ పక్కా అని అంతా అనుకున్న క్యాస్ట్ ఈక్వేషన్ తో పక్కన పెట్టేసి… బట్టి విక్రమార్క ఆద్వర్యంలో కమిటీ వేశారు.
కానీ కమిటీ చూస్తే… టీఆర్ఎస్ కు మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే… అందులో ఉన్న లీడర్లు ఎవరూ తమ నియోజకవర్గాలను దాటి ప్రభావితం చేయలేరు. వారి వారి నియోజకవర్గాల్లో గెలిచేందుకు ఎంతో శ్రమించాల్సి వుంటుంది. అలాంటి వారు రాష్ట్రంలో ఇతర అభ్యర్థులను గెలిపిస్తారా…? పైగా మాటకు, మాట అన్నట్లు కేసీఆర్ ను అన్ని రకాలుగా ఎదుర్కొనగలగాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి మినహా కేసీఆర్ ను ఎదుర్కొలేరు. కానీ రేవంత్ కు క్యాంపెయినింగ్ కమిటీ ఇస్తే, సీఎం స్థానానికి పోటీ అనుకున్నారో ఏమో వర్కింగ్ ప్రెసిడెంట్ తో సరిపెట్టి, ఆయన్ను పార్టీయే పక్కనపెట్టేసింది.
ఇక పోతే, ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. 2014 ఎన్నికలప్పుడు కనపడింది ఆమె మొఖం ప్రజలకు. ఇంతవరకు మళ్లీ కనపడింది లేదు, ప్రజలను కలిసింది లేదు. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్, లేడి అమితాబ్ ఇవన్నీ కావచ్చు. కానీ ప్రజెంట్ ఏంటీ అనేదే ముఖ్యం. కానీ ఆమెకు స్టార్ క్యాంపెయినర్ హోదా తో పాటు, హెలికాప్టర్ ఇచ్చి… రాష్ట్రమంతా తిప్పుతారట. అసలు ఆమె మళ్లీ మెదక్ నుండి పోటీ చేస్తే గెలుస్తుందా…. అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. పోనీ, కార్యకర్తలయినా ఒప్పుకుంటారా అంటే అదీ లేదు.
ఇదీ తెలంగాణలో విజయశాంతి, క్యాంపెయినింగ్ కమిటీ పరిస్థితి. ఆకులు నాకేవాని మూతులు నాకినట్లు…. ఎవరిది వారికే దిక్కులేదంటే, ఇంకోకరి బాద్యత అన్నట్లు తయారైందని… పార్టీలోనే చర్చ జరుగుతోంది.
Leave a Reply