ఇష్టంతో శృంగారంలో పాల్గొంటే త‌ప్పేంది– సుప్రీంకోర్టు.

Read Time: 1 minutes

వివాహేత‌ర సంబంధాలు, స్త్రీ-పురుష విభేదాలు, బార్య‌-భ‌ర్త‌ల గొడ‌వ‌లు. వీటిని ప్ర‌భావితం చేస్తున్న అంశాలపై సుప్రీం కోర్టు సంచ‌ల‌నాత్మ‌క తీర్పునిచ్చింది. సుప్రీం చీఫ్ జ‌స్టిస్ ఆద్వ‌ర్యంలోని ధ‌ర్మాస‌నం ఈ తీర్పునిచ్చింది. ఈ తీర్పు ద్వారా… ఆడ‌, మ‌గ‌వారు ఇష్ట‌పూర్వ‌క‌మమైన శృంగారం త‌ప్పుకాద‌ని స్ప‌ష్టం చేసింది. వారికి పెళ్లైనా, కాకున్నా… ఇద్ద‌రి అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే వారిపై చ‌ర్య‌లు తీసుకునే అధికారం లేద‌ని, అలాంటి చ‌ర్య‌లు తీసుకునే సెక్ష‌న్ 497 ను కోర్టు కొట్టివేసింది.

ఈ దేశంలో స్త్రీ,పురుషులిద్ద‌రూ స్వేచ్ఛ‌గా… స‌మానత్వంతో బ్ర‌తికే హ‌క్కు రాజ్యాంగం ఇచ్చిందని, దాన్ని వ్య‌తిరేకించే ఏ చ‌ట్ట‌మ‌యినా చెల్ల‌ద‌ని విస్ప‌ష్టంగా తేల్చి చెప్పింది. ప్ర‌స్తుతం అమలులో ఉన్న 497 సెక్ష‌న్ పురాత‌న‌మైన‌ద‌న్న కోర్టు, అది రాజ్యంగ విరుద్ద‌మ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ సెక్షన్ వ్యక్తిగత స్వేచ్ఛను కూడా కొంతమేర హరిస్తోందని అభిప్రాయపడింది. సమానత్వం అనేది ప్రాథమిక హక్కు అని న్యాయస్థానం స్పష్టం చేసింది. మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్న స్ఫూర్తికి సెక్షన్ 497 తూట్లు పడుతున్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. మహిళల అసమానతలకు అడ్డుపడే ఏ నిబంధన అయినా రాజ్యంగపరమైనది కాదని వ్యాఖ్యానించింది. అందువల్ల ఈ సంబంధాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ 497 సెక్షన్‌ను కొట్టివేసింది. ముఖ్యంగా మహిళలను చరాస్తిగా చూడడం సరికాదన్నారు. మహిళలను కూడా పురుషులతో సమానంగా చూడాలని సుప్రీంకోర్టు సూచన చేసింది.

సెక్షన్ 497 ప్రకారం భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంటే అతడిపై కేసు పెట్టి విచారణ చేయించే అధికారం భర్తకు ఉంటుంది. అదే సమయంలో భర్త వేరే మహిళతో లైంగిక సంబంధం కొనసాగిస్తే.. ఆమెపై చర్య తీసుకునే హక్కు మాత్రం భార్యకు ఉండదు. భర్తపై చర్యకునే అధికారం కూడా ఈ సెక్షన్ ప్రకారం భార్యకు ఇవ్వలేదు. పెళ్లికాని యువతితో కూడా భర్త సంబంధం కొనసాగిస్తే, ఆ శృంగారం స‌ద‌రు యువ‌తికి ఇష్ట‌మే అయితే… అది ఈ చట్టం పరిగణలోనికి తీసుకోదు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*