ఈ ఓట‌ర్లు, స‌మాజం మారితేనే… దేశానికి శ్రీరామ ర‌క్ష‌

Read Time: 1 minutes

దోచుకుంది దాచుకోవ‌టానికో, మ‌రికొంత దోచుకొవ‌టానికో త‌ప్పా నేటి రాజ‌కీయాలు… ప్ర‌జాసేవ‌కు కాదు అన్న‌ది న‌గ్న స‌త్యం. దేశ‌ప్ర‌దాని అయినా సొంతిల్లు లేని శాస్త్రీ గారి కాలం కాదిది.  ఎక్క‌డ మ‌నీ ఉంటుందో, అక్క‌డ ఖ‌ద్ద‌రు చొక్కాలు వాలిపోతాయి. ఆనాడు ప్రజాసేవ చేసే వాళ్ల‌ను ఖ‌ద్ద‌రు బ‌ట్ట‌ల‌తో ఉంటారు అనేవారు. అప్పుడ‌ది సింబ‌ల్. ఇప్పుడు రాజ‌కీయ నాయ‌కులుంటారు. ఇప్పుడిది సింబ‌ల్.

దేశంలో ఎన్నిక‌ల ఖ‌ర్చు ఎంత‌గా పెరిగిపోయిందో అంద‌రికీ తెలుసు. నాకు డ‌బ్బులు ఇవ్వ‌లేదు, మా ప‌క్కింట్లో ఇచ్చారు… మాకు ఇవ్వ‌లేదు కాబ‌ట్టి మేం ఎవ‌రికీ ఓటు వేయం. మా ఇంట్లో ఉన్న న‌లుగురి పైస‌లిస్తేనే వ‌చ్చి ఓటు వేసేది అని మోహం మీద‌, మీడియా ముందు చెప్పేవారు ఎందరో. దీన్ని ఎంత‌మంది వ్య‌తిరేకించినా, ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలో గ్రౌండ్ రియాల్టీ ఏమాత్రం తెలిసిన వారు… ఈ మాట‌ల‌ను ఒప్పుకోక ఉండ‌రు. అంతేందుకు ప్ర‌త్య‌ర్థులుగా ఒకే చోట పోటీచేసేవారిని, ఒంటరిగా నాలుగు నిమిషాలు వ‌దిలేస్తే వ‌చ్చే మాట‌లు…. రాజ‌కీయాలు బాగా కాస్లీ అయిపోయాయని.

అయినా, స‌ద‌రు లీడ‌ర్లు ఈ దేశ ప్ర‌గ‌తికి, ఈ దేశాభివృద్ధికి చెల్లించే ట్యాక్స్ ఎంత‌…?  కోట్లు ఖ‌ర్చు చేసే ఈ నేత‌లు వారి వారి పేర్లతో చూపిస్తున్న ఆస్తులు ఎంత‌….?  పోటీలో పెట్టే ఖ‌ర్చుకు, వీరు చూపిస్తున్న మొత్తానికి తేడా ఎంత ఉంటుందంటే… అంబానీకి, వాళ్ల ఇంటి ప‌నిమనిషి సంపాద‌నకు ఉన్నంత తేడా.

ఎక్క‌డ ఎన్నిక‌లు వ‌చ్చినా స‌రే, ప్ర‌తిప‌క్ష నేత‌ల్లో కీల‌క‌మైన వారు టార్గెట్ అవుతారు. అప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డ ఉంటారో, ఎలా ఉంటారో కూడా తెలియ‌ని… నాలుగు గ్రూపులు ప్ర‌త్య‌క్ష‌మ‌యి, వారికే వ‌చ్చి న రోటీన్ ఇంగ్లీష్ లో  WE ARE FROM IT అంటూ సోదాలు…  హ‌డావిడీ.     ఇక రోటీన్. ఏరాష్ట్రంలో అయినా ఇదే తంతు. మొన్న‌టి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో అక్క‌డ కీల‌క కాంగ్రెస్ వ్య‌క్తి డీ.కే శివ‌కుమార్ పై ఐటీ, ఈడీ ఎంత హ‌డావిడి చేసిందో అంద‌రం. చూశాం…. ఇప్పుడు రేవంత్ పై జ‌రుగుతున్న త‌తంగాన్ని చూస్తున్నాం. ఎం జ‌రుగుతుందో కూడా తెలుసు. కాక‌పోతే, దొరిక‌న‌ప్పుడే అణ‌చివేసే గుణ‌మున్న తెలంగాణ పాల‌కులు… రేవంత్ ను ఇంకాస్త ఎక్కువ ఇబ్బందిపెట్టే అవ‌కాశం ఉంది.

అయితే, ఈ దేశంలో… ఎన్నో పార్టీలు, ఎంతో మంది నాయ‌కులు, ఎన్నో ఎన్నిక‌లు. వారంతా స‌రిగ్గా ప‌న్నులు చేల్లిస్తున్నారా… అంటే లేదు. ఎంత ఖ‌ర్చుపెడుతున్నారో కండ్ల‌ముందు క‌న‌ప‌డుతుంది. ఈ రోజుల్లో ఒక్క అసెంబ్లీ స్థానానికి ఒక్కో అబ్య‌ర్థి పెట్టే క‌నీస ఖ‌ర్చు 10కోట్లు. పార్ల‌మెంట్ స్థానానికి అయితే 30కి పైమాటే. గ్రామాల్లో ఎక‌గ్రీవం కోసం 5ల‌క్ష‌లు. బ‌హిరంగంగా జ‌రుగుతోంది. కానీ ఎందుకు వారిపై దాడులు, కేసులు ఉండటం లేదు. దీనిపై పూర్తిస్థాయిలో చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది ప్ర‌జాసంఘాలు, మేధావుల వాద‌న‌. ఈ స‌మాజంలో ప్ర‌స్తుత విధానాలు, అనుస‌రిస్తున్న దోర‌ణ‌లు ప్ర‌జాస్వామ్యానికి మంచివి కావ‌ని, దీని ప్ర‌భావం తీవ్రంగా ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. అయితే, ఈ విష‌యంలో ప్ర‌జాస్వామ్య‌వాదులు, ముఖ్యంగా యువ‌త చైత‌న్యం అయి, ఓట‌ర్లను జాగృతం చేస్తే త‌ప్పా… ఎంతో విలువైన‌, పేరున్న భార‌త‌దేశ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ నిల‌బ‌డే ఆస్కారం లేదన్న‌ది మేధావుల మాట‌.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*