ఏపీ ఎమ్మెల్యే కిడారి హత్య వెనుక ఇద్దరు అనుచరులు.. ఏం చేశారు?

Read Time: 0 minutes

వారం రోజుల కిందట.. సరిగ్గా గత ఆదివారం మధ్యాహ్నం సమయంలో అరకు ఎమ్మెల్యే కిడారి దారుణ హత్యకు గురయ్యారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు దగ్గర్నుంచి కాల్చి చంపారు. అయితే ఈకేసులో పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. అటు సీఎం కూడా ఈ ఘటనపై పోలీసుల వైఖరిలో సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు… హత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఈ నేపథ్యంలో…  ఈ హత్యకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు.  కీలక విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు.
మావోయిస్టు సానుభూతిపరులు, ఈ దాడికి ప్రత్యేకంగా సహకరించిన వ్యక్తులు ఎవరన్న దానిపై పోలీసులు ఆరా తీశారు. ఈ క్రమంలో ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారించారు. వీరిద్దరు కిడారికి బాగా సన్నిహితులని సమాచారం. వారు  ఎమ్మెల్యే కిడారి కదలికల్ని ఎప్పటికప్పుడు మావోయిస్టులకు చేరవేసినట్లు తెలుస్తుంది. కిడారిని లివిటిపుట్టుకు వెళ్లేలా చేసింది కూడా వీరేనని సమాచారం.

లివిటిపుట్టులో కిడారి, సోమ హత్య తర్వాత మావోయిస్టులు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ తర్వాత కూడా మావోలు తమ స్థావరాలకు వెళ్లకుండా అక్కడే ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే మన్యంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎక్కడికక్కడ కూంబింగులు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు తలదాచుకున్న సరిహద్దు గ్రామాల్ని గుర్తించిన పోలీసులు… దాడులకు రెడీ అవుతున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా గట్టిగా సమాధానమిచ్చేందుకు బలగాలు సిద్దమవుతున్నాయి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*