క్లైమాక్స్ కు బిగ్ బాస్-2

Read Time: 1 minutes

బుల్లి తెర ప్రేక్ష‌ల‌కుల‌ను… టీవీ సీరీయ‌ల్ ను కాద‌ని, టీవీ రిమోట్ ఆప‌రేట్ చేసేలా చేసిన రియాల్టీ షో బిగ్ బాస్. అందుకే తెలుగు లో ఎంట‌ర్టైన్మెంట్ చాన‌ళ్ల‌లో స్టార్ మాకు ప్ర‌త్యేక‌స్థానం ఉంది. ఎప్పుడైతే మా గ్రూప్ స్టార్ చేతికి వెళ్లిందో, అక్క‌డ నుండే స్టార్ మా రూపురేఖ‌లే మారిపోయాయి. బిగ్ బాస్ తో అటు మ‌హిళ‌లే కాదు, అన్నీ ర‌కాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది.

బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2 కి చాలా తేడాలున్నాయి. బిగ్ బాస్ 1 హోస్ట్ గా ఎన్డీయార్ అంచ‌నాల్ని విప‌రీతంగా పెంచేశారు. పుణేలో వేసిన ఈ ప్ర‌త్యేక ఇంట్లో తార‌క్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇటు హౌస్ మేట్స్ ను అటు ప్రేక్ష‌కుల్ని సంద‌డి చేశారు. ఏడ్పించారు, న‌వ్వించారు. 71 రోజుల పాటు సాగిన ఆ షో తెలుగులో స్టార్ మాను, బిగ్ బాస్ ను ఎక్క‌డికో తీసుకెళ్లింది.

ఇక బిగ్ బాస్ 2లో కొత్త‌గా ట్రై చేసింది యాజ‌మాన్యం. ఇక బిగ్ బాస్ 2 విజేత ఎవ‌రో…  మ‌రికొన్ని గంట‌ల్లో తేలిపోనుంది. ఈసారి సీజ‌న్ లో అన్నీ వేరైటీలే. సాదార‌ణంగా బిగ్ బాస్ లో సెల‌బ్రీటీల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంద‌. కానీ ఇక్క‌డ ముగ్గురు కామ‌న్ మ్యాన్స్. పైగా ఒక్క త‌నీష్ త‌ప్పా, మిగ‌తావారు ఎవ్వ‌రూ పెద్ద‌గా బ‌య‌ట తెలియ‌దు. కానీ ఈసీజ‌న్ లో రోజుకో గేమ్ తో బిగ్ బాస్ 2 కొత్త ఇళ్లు అద‌ర‌గొట్టింది. హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలో వేసిన ఈ కొత్తింట్లో న్యాచుర‌ల్ స్ఠార్ నాని సంద‌డి చేశాడు. మొద‌ట్లో కొంత నేగేటివ్ టాక్ వ‌చ్చినా, త‌ర్వాత త‌ర్వాత బిగ్ బాస్ అంటే జ‌నాల‌కు రుచి చూపించారు. ఎంత‌గా అంటే… ఎప్పుడెప్పుడు టైమ్ అయితుందా…. బిగ్ బాస్ షో స్టార్ట్ అయితుందా అన్నంత‌గా.

ఇప్పుడు మిగిలింది 5గురు హౌజ్ మేట్స్. గెలుపులో కౌష‌ల్ ముందున్నాడు. అస‌లు కౌష‌లే ఈ సీజ‌న్ కు స్పెష‌ల్ అయ్యాడు. కౌష‌ల్ ఆర్మీ పేరిట బ‌య‌ట జ‌రిగిన హాడావిడి అంతాఇంతా కాదు. ఏకంగా 2కె ర‌న్ లు పెట్టారు. ఓ ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో వ‌చ్చారు. ఇటు గీతా-దీప్తి అంతే. మ‌రోవైపు సామ్రాట్, త‌నీష్ లు ఏమాత్రం వెన‌క‌ప‌డ‌కున్నా…. ఈసారి టైటీల్ పోటీ మాత్రం కౌష‌ల్ అండ్ గీతదే అన్న చ‌ర్చ న‌డుస్తోంది.

సో… ఎండింగ్ వ‌చ్చిన బిగ్ బాస్ సీజ‌న్ 2 టైటిల్ ఎవ‌రిని వ‌రిస్తుందో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*