ఖ‌మ్మం జిల్లా పాలేరు క‌మ్మ‌వారికేనా…?

Read Time: 0 minutes

ఖ‌మ్మం జిల్లా. ఈ జిల్లాకు ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ, తెలంగాణ‌లోనూ ప్ర‌త్యేక స్థానం ఉంది. ఖ‌మ్మం జిల్లా  తెలంగాణ రాష్ట్రంలో మిగ‌తా జిల్లాలతో పోలిస్తే ఆర్థిక ప‌రిపుష్టి ఉన్న జిల్లా. అందుకే అక్కడ రాజ‌కీయాలు చాలా కాస్ట్ లీ గా ఉంటాయి. ఆ మ‌ద్య మాజీ మంత్రి  రాంరెడ్డి వెంక‌ట్ రెడ్డి చ‌నిపోతే…పాలేరులో  ఉప ఎన్నిక వ‌చ్చింది. ఆ పాలేరు బై ఎన్నిక‌లో సీనీయ‌ర్ నేత‌, మంత్రి తుమ్మ‌ల టీఆర్ఎస్ త‌రుపున‌, రాంరెడ్డి ఫ్యామిలీ త‌రుపున కాంగ్రెస్ నుండి రాంరెడ్డి వెంక‌ట్ రెడ్డి సతీమ‌ణి పోటీ చేయ‌గా, అది అత్యంత కాస్ట్ లీ ఎన్నిక‌లని ప్ర‌చారం జ‌రిగింది. ఖ‌మ్మంలో  గులాబీ జెండా ఎగురేసేందుకు తుమ్మల కోసం 50కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేశార‌ని ప్ర‌చారంలో ఉంది.

ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో పోటీకి అక్క‌డ నుండి తుమ్మ‌ల మ‌రోసారి పోటీచేసుందుకు రెడీ అయ్యారు. కానీ ఉప ఎన్నిక‌ల్లోనే 50కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు అయితే, ఈ ఎన్నిక‌ల్లో అంత ఖ‌ర్చు పెట్టి డీకొట్టేవారు ఎవ‌రున్నారు అన్న చ‌ర్చ జ‌రిగింది. కానీ అక్క‌డ నుండి ఖ‌మ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి పోటీకి రెడీ అయ్యారు. పైగా క‌మ్మ సామాజిక వ‌ర్గం ను డీకొట్టాలంటే… ఆ సామాజిక వ‌ర్గేత‌ర నాయ‌కుడు అయితేనే గెలుపు సాధ్యం అని గుర్తించారు.  గ‌తంలో వైసీపీ నుండి గెలిచిన ఆ ఎంపీ, త‌ర్వాత టీఆర్ఎస్ లో చేరారు. మొద‌ట్లో ఎంపీకి, తుమ్మ‌ల‌కు బాగానే ఉన్నా, ఆ త‌ర్వాత రెండు వ‌ర్గాల మ‌ద్య తీవ్ర వ‌ర్గ‌పోరుకు దారితీసింది. రెండు వ‌ర్గాల మ‌ద్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే స్థితికి దారి తీసింది.

దీంతో తుమ్మ‌ల‌పై పోటీకి ఎంపీ పొంగులేటి రెడీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. ఆ వార్త తెలియ‌టంతో… సీరీయ‌స్ అయిన టీఆర్ఎస్ అధిష్టానం, ఐటీ దాడుల‌కు పూనుకుంది. దీంతో పొంగులేటి… వెన‌క్కి త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది.  మొత్తంగా… పాలేరు సీటు ఖ‌రీదైన సీటుతో పాటు, ఒక్క సామాజిక‌వ‌ర్గం వారికేనా అన్న అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*