ఠాగూర్ సినిమా స్టైల్లో చనిపోయిన రోగికి మూడురోజుల చికిత్స

Read Time: 0 minutes

చనిపోయిన రోగికి చికిత్స పేరుతో డబ్బులు గుంజేయడం ఈరోజుల్లో చాలా ఆస్పత్రులకు కామనైపోయింది. ఠాగూర్ సినిమాలో చూపించినట్లు చనిపోయాక కూడా మృతదేహానికి ట్రీట్ మెంట్ పేరుతో లక్షలు దోచుకుంటున్నాయి కార్పొరేట్ ఆస్పత్రులు.  అలాంటి ఆస్పత్రి నిర్వాకం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన తాంజావూర్ ఆస్పత్రిలో శేఖర్ అనే వ్యక్తిని చికిత్స నిమిత్తం చేర్పించారు. ముందుగా అతనికి కడుపులోనొప్పి రావడంతో నారాయణపట్నం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కండిషన్ సీరియస్‌గా మారడంతో మెరుగైన చికిత్స కోసం…తంజావూర్ ఆస్పత్రికి తరలించారు.

5 లక్షలు కట్టించుకొని శేఖర్‌ను అడ్మిట్ చేసుకున్న ఆస్పత్రి యాజమాన్యం… మరో మూడు లక్షలు ట్రీట్‌మెంట్‌కు కావాలంటూ అదనంగా డబ్బు చెల్లించమంది. దీంతో అంత డబ్బు చెల్లించలేక శేఖర్ కుటుంబసభ్యులు అక్కడ్నుంచి ఆయనన తంజావూర్ మెడికల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ శేఖర్‌ను పరిశీలించిన వైద్యులు ..అతను చనిపోయి మూడురోజులైందని నిర్ధారించారు. దీంతో శేఖర్ బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. తన తండ్రి చావుకు కారణమై.. డబ్బులు అదనంగా వసూలు చేసుకున్నకార్పొరేట్ ఆస్పత్రిపై శేఖర్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోస్టుమార్టమ్ రిపోర్ట్ వచ్చిన వెంటనే.. సదరు కార్పొరేట్ ఆస్పత్రిపై చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. మరోవైపు ఆస్పత్రి యాజమాన్యం మాత్రం అలాంటిదేమి లేదంటోంది. కావాలనే తమ ఆస్పత్రి పేరును చెడగొట్టడానికే తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించింది. దీనిపై పరువునష్టం దావా కూడా వేస్తామని ప్రకటించింది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*