డిసెంబర్‌లో లోక్ సభ రద్దు… తెరపైకి అసెంబ్లీ సీట్ల పెంపు..?

Read Time: 1 minutes

జ‌మిలీ ఎన్నిక‌లకు సిద్ధం అంటూ లీకులిచ్చి వెన‌క్కి త‌గ్గ‌ని క‌మ‌ళ‌నాథులు… తాజాగా మ‌ళ్లీ ఇదే అంశాన్ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఇప్ప‌టికే తెలంగాణతో పాటు మ‌రో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌పాల్సి వుండ‌గా, అందులో మెజారిటీ రాష్ట్రాలు బీజేపీవే. పైగా రాఫెల్ స్కాం బ‌య‌ట‌ప‌డ్డాక‌… మోడీ,బీజేపీ గ్రాఫ్ వేగంగా తగ్గుతోంది. దీంతో, వెంట‌నే ఎన్నిక‌ల‌కు వెళ్తే… సొంతంగా కాక‌పోయినా, ఎన్డీయే కూట‌మి ద్వారా అయినా మ‌ళ్లీ అధికారం సంపాదించుకోవ్చ‌న్న ఎత్తుగ‌డ వేసిన‌ట్లు డిల్లీ వ‌ర్గాలంటున్నాయి. డిసెంబర్‌లో లోక్‌సభ రద్దు చేసి జనవరి లేదా ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు జోరుగా పావులు కదుపుతోంది.

కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చాక ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా…. ఉత్త‌రాధిపార్టీ అన్న ముద్ర నుండి బీజేపీ బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోయింది. పైగా ద‌క్షిణాదిలో పాగా వేయాల‌న్న మోడీ- అమిత్ షా వ్యూహాలు ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా వ‌ర్క‌వుట్ కాలేదు. ఇప్ప‌టికే కేర‌ళ‌లో ఆ పార్టీ పాచిక‌లు ఏమాత్రం పార‌లేదు. క‌ర్ణాట‌క ఎపిసోడ్ తో బీజేపీ ప‌రువు పూర్తిగా పొగొట్టుకుంది. దీంతో… తెలంగాణ‌లో వేలు కూడా పెట్ట‌లేని స్థితికి బీజేపి చేరింది. కానీ చూస్తూ ఎలా ఊరుకుంటుంది. అందుకే ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ ను పూర్తిగా తన వైపు ఉండేలా… అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్ని తెర‌పైకి తీసుకొచ్చింది. ఇప్ప‌టికే ఆ అంశం కేంద్ర హోంశాఖ‌లో మూల‌న ప‌డ్డ ఫైలును ఇటీవ‌లే దుమ్ము దులిపిన‌ట్లు తెలుస్తోంది. తద్వ‌రా… టీఆర్ఎస్ ను త‌న గుప్పిట్లో ఉంచుకునే ఎత్తుగ‌డ క‌న‌ప‌డుతోంది. ఆంద్రాలో ఎలాగు జ‌గ‌న్ త‌మ మాట కాద‌నే ప‌రిస్థితి లేదు. అందుకే…. ఏపీలో 175 నుంచి225, తెలంగాణలో 119 నుంచి 153 వరకు నియోజకవర్గాల సంఖ్య పెంచేందుకు మోడీ సర్కార్ కసరత్తు చేస్తుంది.

అయితే ఇప్పుడున్న పరిస్థితులల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే… ఏపీ తెలంగాణలో అధికార ప్రతిపక్షాలకు తలనొప్పులు తప్పవు. ఎందుకంటే.. పునర్విభజన జరిగే టైమ్.. టైమింగ్ రెండూ కీలకం. ఏపీ, తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైపోయింది. అందుకే ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెరిగిందంటూ తెలుగురాష్ట్రాల్లో పార్టీల నెత్తిన బండ పడినట్టే. ఎందుకంటే ఎన్నికల ముందు… పెరిగిన అసెంబ్లీ సీట్ల సంఖ్యకు సంబంధించిన లెక్కలు ఓ కొలిక్కిరావు. ఎక్కడ ఏ నియోజకవర్గం చీలుతుందో…? అక్కడ కొత్తగా ఏమొచ్చి కలుస్తుందో ? కొత్తగా వచ్చిన అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎవరిని నిలబెట్టాలి ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేయాలి? ఇలా అనేక సమస్యలు ఎదురవుతాయి. దీనికి తోడు పార్టీలో అనవసర రాద్ధాంతాలు.. రచ్చలు చేసేటోళ్లు ఉండనే ఉంటారు. అయితే ఇవన్నీ కేంద్రంలో ఉన్న అధికార పక్షమైన బీజేపీకి మాత్రం పట్టవు. ఎందుకంటే 2004లో వైఎస్ హయాంలో పునర్విభజన జరిగినప్పుడు అంతా సానుకూలంగానే సాగింది. అప్పట్లో అధికార పార్టీకి ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు.

ఇవన్నీ చూస్తే… మోడీ స‌ర్కార్ డిసెంబ‌ర్ లో త‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసే ఆలోచ‌న ఏమాత్రం ఉన్నా స‌రే, తెలంగాణ ఎన్నిక‌లు కూడా వాయిదా ప‌డే అవ‌కాశం ఉంది. అదే జ‌రిగితే… కేసీఆర్ కు ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మే అంటున్నారు పొలిటికల్ ఎక్స్ ప‌ర్ట్స్.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*