తుంగ‌తుర్తిలో అద్దంకి ద‌యాక‌ర్ కు హ్యండివ్వ‌నున్న కాంగ్రెస్ ?

Read Time: 0 minutes

రాష్ట్ర కాంగ్రెస్ లో ఎప్పుడు ఏం జ‌రుగుతందో ఎవ‌రూ ఊహించ‌లేరు. బండ్లు ఓడ‌లు, ఓడ‌లు బండ్లు కావ‌టం స‌హాజం. ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాల్లో తుంగ‌తుర్తి రిజర్వ్డ్ సీట్. 2014లో చివ‌రి నిమిషంలో ఆ స్థానం నుండి అప్ప‌టి జేఏసీ నేత అద్దంకి ద‌యాక‌ర్ నాట‌కీయ ప‌రిణామాల మ‌ద్య టికెట్ ద‌క్కించుకున్నారు. కానీ పోటీచేసి ఓడిపోయారు. కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ అండ‌తో… అతి విశ్వాసానికిపోయి, రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి వ‌ర్గాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌టంతో ఓట‌మి త‌ప్ప‌లేదు. ఇక 2014 అనంత‌రం… నియోజ‌క‌వ‌ర్గానికి చుట్ట‌పు చూపులా త‌ప్పా, పెద్ద‌గా వ‌చ్చింది లేదు, స‌మ‌స్య‌ల‌పై పోరాడింది లేదు. కేవ‌లం హైద‌రాబాద్ కు ప‌రిమిత‌మై, ప్ర‌తి రోజు ఉద‌యం, సాయంత్రం టీవీ షోల‌కే ప‌రిమిత‌మ‌యిపోయారు.

దీంతో కాంగ్రెస్ లో ద్వీతీయ శ్రేణి నాయ‌క‌త్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇక తుంగ‌తుర్తి నుండి యువ‌కుడు, విద్యావంతుడైన డాక్ట‌ర్ ర‌వి ఈసారి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. పైగా ఆయ‌న‌కు స్థానికంగా మంచి ప‌ట్టు ఉంది. పైగా ఎప్పుడు కార్య‌క‌ర్త‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే నాయ‌కుడు. దీంతో ఈ సారి కాంగ్రెస్ టికెట్ త‌న‌కే వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నారు ర‌వి. పైగా అక్క‌డ కీల‌క‌మైన ఓటు బ్యాంకుపై గట్టిప‌ట్టున్న రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి… డాక్ట‌ర్ ర‌వికి సంపూర్ణ మద్ద‌తు ప్ర‌క‌టించారు. దీంతో త‌న‌కు కాకుండా, మ‌రెవ‌రికీ టికెట్ రాద‌న్న విశ్వాసంతో గ‌ట్టిగా ప‌నిచేస్తున్నారు డాక్ట‌ర్ ర‌వి.

పైగా… అక్క‌డ తాజామాజీ ఎమ్మెల్యే అయిన గాద‌రి కిషోర్ పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. అహంకారిగా, ప్ర‌జ‌ల‌కు స‌రైన స‌మాధానం ఇవ్వ‌క‌పోవ‌టం, ప‌నుల్లో తీవ్ర జాప్యం కార‌ణంగా… ఆయ‌న పై ప్ర‌జ‌లు గుర్రుగా ఉన్నారు. ఇది కూడా ఈసారి డాక్ట‌ర్ ర‌వికి క‌లిసి రాబోతోంది. తుంగ‌తుర్తిలో ఈసారి ఖ‌చ్చితంగా కాంగ్రెస్ గెల‌వ‌బోతోంది అని అన్ని స‌ర్వేలు కోడై కూస్తున్నాయి.  చూడాలి మ‌రీ…ఈసారి ఎంత మెజారిటీతో ఈ సీటు కాంగ్రెస్ ద‌క్కించుకుంటుందో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*