ముస‌లొడైపోయిన‌… కింగ్ నాగార్జున, మ‌ల్టీస్టారర్ల‌కే ప‌రిమిత‌మా….?

Read Time: 0 minutes

యువసామ్రాట్, కింగ్  అక్కినేని నాగార్జున. తెలుగు ఇండస్ట్రీలోని టాప్ హీరోల్లో నాగ్ కూడా ఒకరు. 1986 విక్రం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో నాగ్‌కు మంచి నటుడని పేరొచ్చిన ఆ తర్వాత మాత్రం సరైన హిట్ దొరకలేదు. అప్పుడు 1988లో రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఆఖరిపోరాటం హిట్ కొట్టింది. దీంతో హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కకున్నాడు. ఆ తర్వాత వచ్చిన గీతాంజలి, శివ  సినిమాలు నాగార్జునకు స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టాయి. గీతాంజలి సినిమా నాగార్జునను లవర్ బాయ్ గా మార్చింది.  ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక శివ సినిమా కూడా టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది.

ఆ తర్వాత నాగ్ ఎన్నో సినిమాలు చేశాడు. అయితే మల్టీస్టారర్ మూవీలకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాడు. సీతారామారాజులో హరికృ‌ష్ణతో కలిసి నటించాడు. నిన్నే ప్రేమిస్తానంటూ శ్రీకాంత్‌తో జతకట్టాడు. తన ఏజ్ ఉన్న హీరోలతోనే కాకుండా కుర్ర హీరోలతో కూడా యాక్ట్ చేస్తూ వచ్చాడు. ఊపిరి సినిమాలో యంగ్ హీరో కార్తీతో కలిసి నటించాడు. తాజాగా దేవదాస్ సినిమాలో నేచురల్ నానీతో కలిసి యాక్ట్ చేశాడు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా… ఇప్పుడు నాగ్ మనసులో ఉన్న ఆలోచన బయటపడుతుంది.

దాదాపుగా నాగార్జున వయస్సు 60ఏళ్లకు చేరుకుంటుంది. ఇక ముసలాడ్ని అయిపోతున్నానన్న భావనతోనే.. నాగార్జున మల్టీ స్టారర్ మూవీలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడన్న వార్తలు తెరపైకి వస్తున్నాయి. పైగా, ఇప్పుడున్న త‌న కొడుకుల‌, ఇతర యంగ్ హీరోల‌తో… పోటీప‌డి, హిట్ కొట్ట‌డం అంత హీజీ వ్య‌వ‌హ‌రం కాదు. అందుకే…. హ‌యిగా, మినిమమ్ గ్యారెంటీ క‌లెక్ష‌న్స్ ఉండే మ‌ల్టీసార‌ర్  సినిమాలు తీస్తూ… కాలం వెల్ల‌దీసే ప‌నిలో ఉన్నారు. పైగా ఇలా ఉంటే… హీరో ఇమెజ్ అలాగే ఉంటుంది. లేదంటే ఏమాత్రం గ్యాప్ వ‌చ్చినా, క్యారెక్ట‌ర్ అర్టిస్ట్ గా అవ‌తారం ఎత్తాలి. పైగా అది త‌న‌కు, త‌న ఫ్యాన్స్ కు న‌చ్చని ప‌ని. అందుకే…. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొనే పనిలో పడ్డాడని టాలీవుడ్ గుసగుసలాడుకుంటుంది. నాగ్ ఫ్యూచర్ ప్లాన్ సూపర్ అంటూ చర్చించుకుంటుంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*