యూపి త‌ర‌హా బీజేపీ స్కెచ్. తెలంగాణ యోగి ఆదిత్యానాథ్ రెడీ

Read Time: 1 minutes

కేంద్రంలో అధికారంలో ఉండి, దేశ‌వ్యాప్తంగా కాషాయ‌జెండా ఎగుర‌వేసుకుంటూ వ‌స్తోన్న బీజేపీకి… తెలంగాణ ప‌రిస్థితులు మింగుడుప‌డ‌టం లేదు. కొత్త చేరిక‌లు అంతంత మాత్రంగా ఉండ‌టం, చేరేవారు కూడా చివ‌రి ఆప్ష‌న్ గా బీజేపీ వైపు చూస్తుండ‌టం, కేసీఆర్-బీజేపీ దోస్తానా లాంటి వార్త‌లు బీజేపీని మ‌రింత వీక్ చేస్తున్నాయి. ఉన్న లీడ‌ర్లు కూడా… పేప‌ర్ పులులుగా మార‌టంతో, బీజేపీ కొత్త అస్త్రాన్ని రెడీ చేస్తోంది. ఎలాగైనా మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌న్న క‌సి కేంద్ర నాయ‌క‌త్వంలో క‌న‌ప‌డుతోంది.

అందుకే… రెండు బ‌ల‌మైన కూట‌ముల మ‌ద్య నెగ్గుక‌రావ‌టం క‌ష్ట‌మ‌నుకున్న యూపీలో యోగి ఆదిత్య‌నాథ్ ఫార్మూలా సూప‌ర్ వ‌ర్క‌వుట్ అయింది. అందుకే అక్క‌డ బీజేపీ దూకుడుకు ప్ర‌తిప‌క్షాల‌న్నీ క‌నుమ‌రుగ‌య్యాయి. ఇక్క‌డ తెలంగాణ‌లో కూడా ఇదే ఫార్మూలా అప్లై చేసే యోచ‌న‌లో ఉంది బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం.

కొంత‌కాలంగా… హిందుత్వ వాదంతో ముందుకెళ్తూ, అంతాతానే అయి వ్య‌వ‌హ‌రిస్తున్న స్వామి ప‌రిపూర్ణానంద‌ను తెర‌పైకి తీసుక‌రాబోతుంది. ఆయ‌న కూడా రాజ‌కీయాల‌వైపు ఆస‌క్తి గా ఉండ‌టంతో, ప‌రిపూర్ణానంద సీఎం అభ్య‌ర్థిగా ఎన్నిక‌ల యుద్ధంలోకి దీగేందుకు రెడీ అయింది బీజేపీ. ఇప్ప‌టికే అందుకు అనుగుణంగా… రాష్ట్రంలోని కొంత‌మంది నేత‌లు, ఆర్.ఎస్.ఎస్ నేత‌ల‌తో సంప్ర‌దింపులు కూడా పూర్త‌యిన‌ట్లు స‌మాచారం అందుతోంది. ఆర్.ఎస్.ఎస్ కూడా ఇందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని, అతి త్వ‌ర‌లోనే… అధికారిక ప్ర‌క‌ట‌న‌లు ఉండ‌బోతున్నాయంటోంది బీజేపీ కార్యాల‌య వ‌ర్గాలు. ఉన్న వ‌న‌రుల‌తో… బూత్ లెవ‌ల్ క‌మిటీల‌తో ఫార్మూలా స‌క్సెస్ చేసే ప‌నిలో ఇప్ప‌టికే… ఎన్నిక‌ల టీంలు రంగంలోకి దిగాయంటున్నారు నేత‌లు.

అయితే, ఆయ‌న‌పై ఆంద్రా వ్య‌క్తిగా మ‌ద్ర ఉన్న‌ప్ప‌టికీ, తెలంగాణ‌లో ఉన్న‌వారంతా… ఇక్క‌డి వారేనని ఉద్య‌మ‌నేతే కేసీఆర్ చెప్ప‌డం, ఇప్పుడు టీఆర్ఎస్ విమ‌ర్శ‌ల‌కు పొకుండా అడ్డుప‌డుతుంది. చూడాలి మ‌రీ… యూపీ యోగి ఫార్మూలా ఇన్ తెలంగాణ ఎలా వ‌ర్క‌వుట్ అయితుందో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*