రెడ్డీ నేత‌లే టార్గెట్ గా కేసీఆర్ కుల రాజకీయం

Read Time: 1 minutes

తెలంగాణ రాజ‌కీయాల‌కు కొత్త రూపు వ‌స్తోంది. పోరాటాల‌కు, ఆకాంక్ష‌ల‌కు కేంద్ర‌బిందువుగా ఉన్న తెలంగాణ రాజ‌కీయాల్లో కులాల కుమ్ములాటలు మొద‌ల‌వుతున్నాయి. మొద‌లుపెట్టింది ఎవ‌రైనా… ఈ జాడ్యం అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. అన్యాయాల‌ను ఎదురించి, తుపాకీ పెత్త‌నాన్ని సైతం నిల‌దీసిన  గ‌డ్డ ఇప్పుడు కులాల కంపులో మునిగి తేల‌బోతుందా అంటే అవున‌నే సూచ‌న‌లు క‌న‌ప‌డుతున్నాయి.

రాజ‌కీయ నేత‌లు… త‌మ రాజ‌కీయ జీవితం నిండు నూరేళ్లు సాగాల‌న్నా, అవ‌స‌ర‌మ‌యితే త‌మ వార‌సుల‌కు ప్రాణం పోసి వారుకూడా ఎద‌గాల‌న్నా… కులాల చ‌ట్రంలో ప్ర‌జ‌ల‌ను ఇరికిస్తే వారిచావు వారు చ‌స్తారు, పాల‌కులు వారి ప‌ని వారు చేసుకుంటారు. అదే తెలంగాణ‌లో రాబోతున్న‌ట్లుగా క‌న‌ప‌డుతున్నా, రెండు ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గాలు నువ్వా-నేనా అన్న‌ట్లు క‌త్తులు దూసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక అధికారం అనుభ‌వించిన టీఆర్ఎస్ పార్టీ మొత్తం  వెల‌మ సామాజిక క‌నుస‌న్న‌ల్లోనే న‌డిచింద‌న్నది చాలా సుస్ప‌ష్టం.  అందుకు ఎన్నో ఉదాహార‌ణ‌లున్నాయి. ఆ మ‌ద్య ఓ టీవీ చాన‌ల్ లో… కేసీఆర్ ఆస్థాన క‌వులుగా ఉన్న నేత‌లంతా మూకుమ్మ‌డిగా రెడ్డీ సామాజిక వ‌ర్గం మీద దాడి మొద‌లుపెట్టారు. నాడు స్టార్ట్ అయిన దండ‌యాత్ర కొన‌సాగుతూనే ఉంది. ఎంత‌గా అంటే… మ‌ళ్లీ ఇదే ప్ర‌భుత్వం వ‌స్తే ఇక రెడ్డీ నాయ‌కుల‌ను, రెడ్డీ సామాజిక వ‌ర్గాన్ని రాజ‌కీయంగా అణ‌చివేస్తుంద‌ని.

రెడ్డీ సామాజిక వ‌ర్గాన్ని తొక్కేసే ఎత్తుగ‌డ‌లో భాగంగానే టీఆర్ఎస్, కేసీఆర్ కేసుల‌కు పూనుకున్నారు. మొద‌ట‌గా గ‌జ్వేల్ నాయ‌కుడు ప్ర‌తాప్ రెడ్డిని టార్గెట్ చేశారు.  త‌న నియోజ‌క‌వ‌ర్గం నుండి ఉస్మానియా క్యాంపస్ లో చ‌దువుతున్న వ్య‌క్తి ఉరి వేసుకొని చ‌నిపోతే ప‌రామ‌ర్శించ‌డానికి వెల్లిన ఆయ‌న‌ పై ఎన్నో కేసులు పెట్టి చిత్ర‌హింస‌ల‌కు గురిచేశారు. సీఎం సొంత నియోజ‌వ‌ర్గంలో భూసేక‌ర‌ణ విష‌యంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండ‌టంతో ఆయ‌న పై లాఠీల‌కు కూడా ప‌నిచేప్పారు.

ఇక ఎన్నిక‌లకు రెడీ అయ్యాక‌… రెడీ నేత‌ల‌పై దాడులు మ‌రింత పెరిగాయి.  సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గ నేత‌ జ‌గ్గారెడ్డి పై 14 ఏండ్ల నాటి కేసును తిర‌గ‌తోడి జైలు పాలు చేశారు. ప్ర‌స్తుతం ఎంతో క‌ష్టం మీద ఆయ‌న బెయిల్ పై ఉన్నారు. ఇక  భూపాల ప‌ల్లి కాంగ్రెస్ నేత గండ్రా వెంక‌ట‌ర‌మ‌ణా రెడ్డీని ఇలాగే ఇరింకించే ఎత్తుగ‌డ వేసి, కేసు న‌మోదు చేశారు. ఇప్ప‌టికే కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ పై కేసులున్నాయి. న‌ల్గొండ‌లో హ‌రీష్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా వారిపై కేసులు న‌మోదుచేశారు. ఇక కాంగ్రెస్ లో కీల‌క నేత‌గా ఎదుగుతున్న  రేవంత్ రెడ్డీని వ‌ద‌ల్లేదు. 2001నాటి భూకేటాయింపుల కేసుతో పాటు, వారి బందువుల పేర్ల‌తో ఉన్న కంపెనీల్లో రేవంత్ మ‌నీ ల్యాండ‌రింగ్ చేశార‌ని, వేల కోట్లు సంపాదించారంటూ కేసులు న‌మోదు చేస్తూ హాడావిడీ చేస్తున్నారు.

వీట‌న్నింటి వెన‌క స్ప‌ష్ట‌మైన ఒకే సామాజిక వ‌ర్గ నేత‌లు టార్గెట్ గా ఉండ‌టంతో పాటు, ఈడీ తో కేసుల‌ను వేయించే ప‌నిలో  ఉన్నారు. త‌ద్వారా… త్వ‌ర‌లో మ‌హ‌కూట‌మితో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌నుకుంటున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీల‌కు ఓటుకు నోటు అంశంతో పాటు, అవినీతితో అంట‌కాగుతున్నార‌న్న విమ‌ర్శ‌ల‌తో… రెండు పార్టీల మ‌ద్య స్నేహాన్ని చీల్చే కుట్ర కూడా  ఉందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*