సైనికుడే…రాష్ట్ర ర‌థ‌సార‌ధి అయితే

Journalist Opinion

Read Time: 1 minutes

సైన్యంలో అర‌వీర‌భ‌యంక‌ర యుద్దాల్లో దేశం త‌రుపున పోరాడిన వారిని శంకించ‌గ‌ల‌మా….? ప‌్రాణ‌ల‌ను లెక్క‌చెయ‌కుండా, కుటుంబాన్ని గుర్తుచేసుకోకుండా… దేశ ప్ర‌జ‌లే నాకుటుంబం, నా కుటుంబాన్ని ర‌క్షించుకోవాల‌న్న త‌పన ఉండే సైనికునికి ఏమిచ్చి రుణం తీర్చుకోగ‌లం. అలాంటి సైనికుడు యుద్దం క్ష‌త‌గాత్రుడిగా, దేశ ప్ర‌థ‌మ పౌరుడికి సేవ‌లందిస్తూ, ఇది కాదు నేను చేయాల్సింది… నా మాతృభూమి నాకోసం ఎదురుచూస్తుందంటూ వ‌చ్చిన వీర సైనికుడ‌త‌ను. రాజ‌కీయాలు అత్యంత‌ద‌య‌నీయ‌మైనవి అని తెలిసినా, దేశం బాగుప‌డాలంటే… మూలం రాజ‌కీయాలే అని గ్ర‌హించి… రాజ‌కీయ ప్ర‌వేశం చేసి, నేడు అవినీతి అంతానికి, రాష్ట్ర ప్ర‌జ‌ల బాగోగుల కోసం పోరాడుతున్న సైనికుడు కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, పార్టీ ఘోర ఓట‌మి త‌ర్వాత పార్టీ చుక్కాని లేని నావ‌లా త‌యారైంది. చీక‌ట్లో గ‌మ్యం లేకుండా ప్ర‌యాణిస్తున్న‌కాంగ్రెస్ అనే నావ‌కు టార్చిలైట్ వేస్తూ… నేనున్నాను అంటూ వ‌చ్చాడు కెప్టెన్ సాబ్. రాష్ట్రంలో మిష‌న్ భ‌గీర‌థ‌, ప్రాజెక్టుల్లో రీడిజైన్ పేరుతో భారీగా అవినీతి, త‌న కుటుంబ క‌నుస‌న్న‌ల్లో న‌డిచే కంపెనీలకు ప్ర‌భుత్వం ఇస్తున్న న‌జ‌రానాల‌ను బ‌య‌ట‌పెట్ట‌గ‌లిగాడు. రాష్ట్రంలో వ‌చ్చిన నేరేళ్ల ఇసుక‌లారీలు, ద‌ళితుల‌పై దాడులు, ఖ‌మ్మం జిల్లాలో రైతుల‌కు బేడీలు, భూసేక‌ర‌ణ స‌మ‌స్య‌లు ఇలా ఒకటా రెండా…. రాష్ట్రంలో గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వాల్లో వెలుగు వెలిగి, ఆర్థికంగా స్థిర‌ప‌డ్డ నేత‌లు ఒక్క మాట మాట్లాడ‌క‌పోయినా, పార్టీలో స‌హ‌క‌రించిక‌పోయినా… యుద్దంలో సైనికుడి వ‌లే బ‌రిగీసి యుద్ద‌రంగంలో టీఆర్ఎస్ తో క‌ల‌బ‌డ్డాడు. నిల‌బ‌డ్డాడు. ఈరోజో రేపో మారుతుండు అని ఒక‌వైపు, కాంగ్రెస్ కే సాధ్య‌మ‌యిన గ్రూపులు మ‌రోవైపు వెంటాడుతున్న ఎనాడు ఆదైర్య‌ప‌డ‌లేదు. పైగా…రెట్టించిన ఉత్సాహాంతో మ‌రింత దూకుడుగా ముందుకుసాగాడు. నేడు రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాల‌ను ఒక్క కూట‌మిగా చేయ‌టంలో ఉత్త‌మ్ పాత్రే ఎంతో కీల‌కం.

Uttam_Komatireddy

ఇక‌, కేసీఆర్ కు రాష్ట్రంలో పోటీదారుడు ఎవ‌రున్నారు… అనే వారికి సరైన స‌మాధానం గా క‌న‌ప‌డుతున్నాడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పార్టీ అధికారంలో వున్నా, ఏ నాయ‌కుడు అధికారంలో వున్నా… అవినీతి స‌హ‌జ‌మై పోయింది. కేసీఆర్ నేతృత్వంలో ఆయ‌న కుటుంబ స‌భ్యులు, అంత‌కుముందు ఆయా ముఖ్య‌మంత్రుల కుటుంబాలు. అవినీతి కామ‌న్ అయిపోయింది. త‌ర‌త‌రాల‌కు, మునిమ‌నుమ‌ల‌కు కూడా ఇప్పుడే అవినీతి కంపుతో సంపాదించిపెట్టారు. కానీ ఉత్త‌మ్ కు ఎవ‌రున్నారు. బందుప్రీతి లేదు. ఆయ‌న బిడ్డ‌లు లేరు. ఇంకా ఎవ‌రికోసం అవినీతి చేస్తాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న కు అవినీతి మ‌ర‌క‌లు కూడా లేవు. త‌న‌ను ఇబ్బంది పెట్టేందుకు… కేసీఆర్ వ‌చ్చాక‌, ఇందిరమ్మ ఇండ్ల‌లో అవినీతి జ‌రిగింద‌ని… ఉత్త‌మ్ ను ఇరికించే ప్ర‌య‌త్నం చేసినా స‌ఫ‌లం కాలేదు. క‌డిగిన ముత్యంలా బ‌య‌ప‌డ్డాడు. సో ఉత్త‌మ్ కు పైస‌ల సంపాద‌న అవ‌స‌రం లేదు. పైగా ఆయ‌న మ‌నీ మైండెడ్ కాదు.

ఇక ఈ నాలుగున్న‌రేళ్ల తెలంగాణ రాష్ట్రంలో… అన్ని ప్రాంతాల్లో ఉత్త‌మ్ ప‌ర్య‌టించాడు. ప్ర‌జ‌లు ఎక్క‌డ ఇబ్బందిప‌డుతున్నారు, ఎక్క‌డ ఏ స‌మ‌స్య ఉంది, ఎక్క‌డ ప్ర‌భుత్వం వైఫ‌ల్యం చెందింది లాంటి స‌మస్య‌ల‌ను పార్టీ అద్య‌క్షుడిగా ద‌గ్గ‌ర నుండి చూశాడు. అసెంబ్లీ కొట్లాడిన అనుభ‌వం ఉంది. ప్ర‌జ‌ల‌కు ఏం కావాలో స్ప‌ష్ట‌మైన అవ‌గాహాన ఉంది. ఇంత‌క‌న్నా ఓ నాయ‌కునికి, ఓ ముఖ్య‌మంత్రికి కావాల్సిన ల‌క్ష‌ణాలు ఏముంటాయి.

ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న త‌ప‌న‌తో, అవినీతి కోసం ఆరాట‌ప‌డ‌ని మ‌న‌స్త‌త‌త్వంతో, ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలిస‌న నాయ‌కుడు… ఉత్త‌మ్ కాక మరెవ‌రు. సీఎం అభ్య‌ర్థిగా ఆయ‌న‌కాకుండా ఇంక‌వెరుంటారు.

 

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*