కేసీఆర్ ను దీటుగా ఎదుర్కొనేందుక కాంగ్రెస్ ఎన్నారై సెల్ రెడీ

Read Time: 1 minutes

బ్ర‌తికేందుకు ఏ దేశ‌మ‌యితే ఏముంది. అయినా ఈ రోజుల్లో ప్ర‌పంచ‌మంతా మ‌న చేతిలోనే క‌దా. జ‌స్ట్ ఒక్క సెల్ ఫోన్ తో ప్ర‌పంచంలో ఎక్క‌డున్నా, ఎలా ఉన్నా, మంచి చెడ్డా అన్ని తెలుసుకోవ‌చ్చు, పంచుకోవ‌చ్చు. ఒకే ఇదంతా త‌న ఫ్యామిలీ వ‌ర‌కు అయితే ఒకే. ……………… మ‌రి మ‌న ఊరు, మ‌నం చ‌దివిన స్కూల్, కాలేజీలు. మ‌న ప్రాంతం…? అందుకే ప్ర‌పంచంలో ఏ మూల‌న ఉన్నా, నా దేశం, నా రాష్ట్రం, నా జిల్లా,  నా గ్రామం అని ఆలోచించే వారే అస‌లైన ఆ ప్రాంత ముద్దుబిడ్డ‌లు. వాళ్లే…. అస‌లైన‌ NRI లు.

నాటి మ‌లిద‌శ ఉద్య‌మంలో అయినా, స్వ‌రాష్ట్రంలో జ‌రుగుతున్నప్ర‌స్తుత‌ పాల‌న‌లో జ‌రుగ‌తున్న అన్యాయాల‌పై  పోరాటం అయినా… త‌మ వంతు పాత్ర పోషించేందుకు న‌డుంక‌ట్టారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కోసం ప‌నిచేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. మేం ఎక్కుడున్నా… మా అమ‌రుల ఆశయాల‌కు అనుగుణంగా మా రాష్ట్రం స‌ల్లంగుండాలే అన్న‌ట్లు పోరాడుతున్నారు. ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ త‌రుపున కృషిచేయ‌బోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎన్నారై సోష‌ల్ మీడియా సెల్ ద్వారా… కేసీఆర్ అనుస‌రిస్తున్న విధి,విధానాలు ప్ర‌జ‌ల ముందుంచ‌బోతున్నారు. ఎందుకోసం రాష్ట్రం కోసం కొట్లాడాల్సి వ‌చ్చింది, రాష్ట్రం వ‌చ్చాక పరిపాల‌న ఎలా ఉంది, ఈ ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్ప‌డ‌టం ఎంత అవ‌స‌రమో విడ‌మ‌రిచి చెప్ప‌బోతున్నారు.

ఇప్ప‌టికే కేసీఆర్ ను ఎదుర్కొనే వ్యూహాంలో భాగంగా… ప‌క్కా ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నారు. కేసీఆర్ ఇచ్చిన హ‌మీలు, అమ‌లుపై ప్ర‌త్యేక డాక్యుమెంట‌రీలు త‌యారుచేయిస్తున్నారు. ఇందుకోసం అవ‌స‌ర‌మైన ఫండ్ కూడా సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తొంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నారైసెల్ త‌రుపున కాలిఫోర్నియాకు చెందిన ప్ర‌ముఖ బిజినెస్ మ్యాన్ దాదాపు 6 కోట్ల రూపాయాలు స‌మ‌కూర్చుతున్న‌ట్లు తెలుస్తోంది. వీరితో పాటు మ‌రికొంత మంది కూడా ఆర్థికంగా స‌హాయ స‌హ‌కారాలు అందించేందుకు ముందుకువ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చే వ‌ర‌కు… సోష‌ల్ మీడియా ద్వారా భావ‌జాల వ్యాప్తి కి కృషిచేయ‌టం, ఆ తర్వాత కాంగ్రెస్ ఎన్నారై సెల్ త‌రుపున ప్ర‌చారంలో కూడా భాగ‌మ‌య్యేందుకు రెడీ అయ్యారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప‌రిస్థితులు, తెలంగాణ‌లో ముఖ్యంగా నిరుద్యోగ స‌మ‌స్య‌లు ఎలా ఉన్నాయి, ఎందుకు కేసీఆర్ ఆయ‌న టీం విద్యార్తుల‌కు ఉద్యోగ క‌ల్ప‌న‌లో వెన‌క‌బ‌డింది, ఎలా వ్య‌వ‌సాయరంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, కేసీఆర్ కొద్దిమంది ప్ర‌ముఖ వ్యాపారుల‌కే ఎలా ల‌బ్ధిచేస్తున్నారో వివ‌రించ‌బోతున్నారు.

చూడాలి మ‌రీ… ఎన్నారైల పోరాటం ఎంత‌వ‌ర‌కు ఫ‌లిస్తుందో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*