సూర్యాపేట‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే

Read Time: 0 minutes

సూర్యాపేట రాజ‌కీయం ర‌గులుతోంది. మొద‌టిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రి గా ప‌నిచేసిన జ‌గ‌దీష్ రెడ్డికి నోటి దురుసు అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అతి త‌క్కువ మెజారిటీతో గెలిచిన‌… జ‌గ‌దీష్ రెడ్డికి,  ఈసారి ఓట‌మి త‌ప్పెలా క‌న‌ప‌డ‌టం లేదు. అంత‌వ‌ర‌కు అధికారం రుచి చూడ‌ని ఆయ‌న‌కు, ఆయ‌న అనుచ‌ర‌గ‌ణానికి…  ఒక్క‌సారిగా అధికారం క‌న‌ప‌డటం తో రెచ్చిపోయారు. జిల్లాలో అంతా తామే అయి… న‌డిపించుకున్నారు. జిల్లాల్లో ఏ సెటిల్ మెంట్ల‌యినా, బెదిరింపులు జ‌రిగిన‌ట్లు బ‌య‌ట‌కు వ‌చ్చినా… దాని లింకులు నేరుగా మంత్రికి గానీ, ఆయ‌న అనుచ‌రుల‌కు గానీ ఉండే ఉన్నాయి. అదే ఇప్పుడు జ‌గ‌దీష్ రెడ్డికి మైన‌స్ గా మారింది.

సూర్యాపేట జిల్లా అయ్యాక‌… మ‌రింత అభివృద్ది పెరుగుతంద‌నుకుంటే అవినీతి పెరిగిపోయింది. కొత్త కలెక్ట‌రేట్ల నిర్మాణం, కార్యాల‌యాల నిర్మాణ స‌మ‌యంలో నేరుగా మంత్రిపైనే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఎన్నో చేస్తామ‌ని చెప్పినా… అభివృద్దికి దూర‌మ‌యింది సూర్యాపేట‌.

అదే ఈసారి ప్ర‌త్య‌ర్థుల‌కు ఆయుధంగా మారింది. ముఖ్యంగా ఈసారి ఎన్నిక‌ల్లో మాజీ మంత్రి, టైగ‌ర్ గా అభిమానులు అప్యాయంగా పిలుచుకునే రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి దీటుగా ముందుకు దూసుక‌వ‌స్తున్నారు. న‌ల్గొండ జిల్లాల్లో జానా త‌ర్వాత అంత‌టి సీనీయ‌ర్ నాయ‌కుడు.  గ‌తంలో ఆయ‌న చెసిన ప‌నులతో పాటు, ఈ నాలుగున్న‌రేళ్ల‌లో జ‌రిగిన ప‌నుల‌పై ఆయ‌న బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు.  గ‌త ఎన్నిక‌ల్లో భారీగా ఓట్లు చీల్చి ప‌రోక్షంగా జ‌గ‌దీష్ రెడ్డి గెలుపుకు కార‌ణ‌మైన సంకినేని ఈసారి  మూడోస్థానానికి ప‌రిమితం కాబోతున్నారు. ఇప్ప‌టికే రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి ఆయ‌న కుమారుడు స‌ర్వోత్తం రెడ్డి కూడా ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. పైగా వీరికి రాహుల్ తో మంచి సంబంధాలున్న‌ట్లు తెలుస్తోంది.

పైగా.. ఇప్ప‌టికే రెండుసార్లు మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వ‌మున్న నాయ‌కుడు కావ‌టంతో, ఆయ‌న‌కు ప్ర‌తి గ్రామంలోనూ విస్తారంగా ప‌రిచయాలున్నాయి.  ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే మ‌ళ్లీ మంత్రిప‌ద‌వి ద‌క్క‌టం  ఖాయంగా క‌న‌ప‌డుతోంది. పైగా గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున పోటీ చేసిన ప‌టేల్ ర‌మేష్ రెడ్డి కూడా రాంరెడ్డి వ‌ర్గానికే మ‌ద్ద‌తిస్తుండ‌టంతో… రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి గెలుపు ఖాయంగా క‌న‌ప‌డుతోంది.

సూర్యాపేట నియోజ‌క‌వ‌ర్గంలోని సూర్య‌పేట‌, ఆత్మ‌కూర్ ఎస్, చివ్వంల‌,పెన్ ప‌హాడ్ మండ‌లాల్లో… ఏ మండ‌లంలో కూడా పూర్తిస్థాయిలో ప‌నులు జ‌ర‌గ‌లేద‌ని… కేవ‌లం ప్రచార ఆర్భాటం కోసం ఓపెనింగ్ ల‌కే ప‌రిమిత‌మ‌య్యార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో… ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలోనే అంద‌రి చూపు సూర్య‌పేట‌పైనే ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*