
టీఆర్ఎస్ అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత దృష్ట్యా ఇప్పటికే ప్రకటించిన అబ్యర్థుల్లో కొందరి మార్పు తప్పదని టీరాఎస్ అధిష్టానం సిగ్నల్స్ పంపిస్తూ వస్తోంది. ఇప్పటికే వారి పనితీరుపై అసంతృప్తి ఉన్నా, అభ్యర్థుల ప్రకటన చేశాక అయినా, మార్పు వస్తుందని భావించారు. కానీ పరిస్థితిలో మార్పు లేకపోవటంతో… కొంతమంది అభ్యర్థులను మార్చబోతున్నారు. అందులో మొదటిలిస్టులో నాగార్జున సాగర్ ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న స్థానాల్లో నాగార్జున సాగర్ ఒకటి. అక్కడ ప్రతిపక్షనేతగా ఉన్న జానారెడ్డికి తెలంగాణ వచ్చాక వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అందుకే ఆయన కూడా మిర్యాలగూడపై కన్నేసినా… సాగర్ ను మాత్రం వదులకోరు. కానీ, జానారెడ్డి పై దశాబ్ధాలుగా ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునే సరైన నాయకుడు అక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీకి లేరు. గత ఎన్నికల్లో సీపీఎం నుండి నోముల నర్సింహయ్యను టీఆర్ఎస్ నుండి బరిలో దింపినా ఫలితం మారలేదు. ఆ తర్వాత జానారెడ్డి కీలక అనుచరులు ఎంతో మంది టీఆరెఎస్ లో చేరినా, దాన్ని ఏమాత్రం నోముల వినియోగించుకోలేదు. అలాగని టీడీపీ నుండి వచ్చిన నేతలను ఎదగనివ్వలేదు. దీంతో జానారెడ్డిపై వ్యతిరేకత ఉన్నా, దాన్ని అందిపుచ్చుకునే లీడర్ ఎవరూ లేకపోవటంతో… టీఆరెఎస్ ఇన్నాళ్లు వేచిచూసింది.
అయితే, రంజిత్ యాదవ్ రూపంలో సాగర్ లో టీఆర్ఎస్ కు ఇప్పుడు కొత్త ఊపొచ్చింది. రంజిత్ యాదవ్ అనే ఎన్ ఆర్ ఐ సాగర్ నుండి టీఆర్ఎస్ తరుపున పోటీ చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే రంజిత్ యాదవ్ తో పార్టీ ముఖ్యనేతలు మాట్లాడినట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే రంజిత్ యాదవ్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. అయితే, అంతకుముందు నోములతో కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ స్వయంగా మాట్లాడిన తర్వాత… ప్రకటన వెలువడనుంది.
నాగార్జున సాగర్ లో బీసీల ఓటు బ్యాంకు చాలా కీలకంగా ఉంది. పైగా అక్కడ యాదవ సామాజికవర్గం నేతలు ఎక్కువ. దీంతో రంజిత్ యాదవ్ పేరును టీఆరెస్ పరిశీలించినట్లు తెలుస్తోంది. పైగా ఉత్సాహాంగా… చాలా కార్యక్రమాల్లో పాల్గొనటం, అనేక సేవా కార్యక్రమాలు చేయటం, ఎన్.ఆర్.ఐ విభాగంలో పార్టీలో కీలకంగా పనిచేయటం రంజిత్ కు కలిసివచ్చినట్లు గా తెలుస్తోంది.
సాగర్ లో ఎదురులేని జానారెడ్డికి… స్వయంగా జానారెడ్డి పోటీచేసినా, లేక ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి పోటీచేసినా.. రంజిత్ చేతిలో ఓటమి తప్పదని సాగర్ వాసులంటున్నారు. ఎప్పటి నుండో అభివృద్దికి నోచుకోని సాగర్ కు, రంజిత్ రూపంలో అభివృద్ది లభించబోతుందని… రంజిత్ తమకు శ్రీమంతుడిలా పనిచేస్తారన్న నమ్మకం ఉందని గ్రౌండ్ టాక్.
Leave a Reply