టైంపాస్ కే తార‌లు, పేరుకే బ్రాండ్స్

Read Time: 1 minutes

గ్లామ‌ర్ బ్యూటీస్ కు… ఉన్న ఆద‌ర‌ణ అంతా ఇంతా కాదు. మ‌త్తెక్కించే అందంతో యువ‌త‌ను పిచ్చేక్కిస్తుంటారు. అందుకే వీరి గ్లామ‌ర్ ను త‌మ బిజినెస్ కు వాడుకునే క్ర‌మంలో… వేల కోట్ల మొత్తాలు ఇచ్చి మ‌రీ, యాడ్స్ చేయించుకుంటారు. ఇదంతా… కాయిన్ కు ఒక‌వైపు.

మ‌రోవైపు… కొంత‌మందిలో పెద్ద హృద‌యం ఉంటుంది. మ‌రికొంత మందిలో చీక‌టి కోణం ఉంటుంది. పెద్ద హృద‌యం వున్న వారు జ‌నం కోసం, ప్ర‌జ‌ల కోసం, పేద‌-నిరుపేద‌ల కోసం ఆలోచిస్తారు. వారిని ప‌క్క‌న పెడితే… చీక‌టి కోణంలో మునిగితేలే వారే ఎక్కువ‌. ఓవైపు సంపాద‌న‌, మ‌రోవైపు హోదా, గ్లామ‌ర్ అలాగే ఉండ‌టం. కొంద‌రు చీక‌టికోణాల‌ను, గ్లామ‌ర్ తో క‌లిపి… రాజ‌కీయాల‌ను చుట్టేసేవారు ఉంటారు. ఎవ‌రు ఎలాంటి వారు అనేది ప్ర‌జ‌లు తెలుసుకోవాల్సిందే.

ఇదంతా… ప‌క్క‌న పెడితే, గ్లామ‌ర్ గ‌ల్స్ క్రేజీతో… కొన్ని ప్రభుత్వ కార్య‌క్ర‌మాలు మొద‌లుపెడుతుంటారు. అలా మొద‌లుపెట్టిన వాటిలో భేటీ ప‌డ‌వో, భేటీ బ‌చావో ప్రోగ్రాం ఒక‌టి. ఈ కార్య‌క్రమం కోసం ర‌కుల్ ప్రీత్ సింగ్ ను తెలంగాణ ప్ర‌భుత్వం బ్రాండ్ అంబాసీడ‌ర్ గా నియ‌మంచి, కేటీఆర్ ఆద్వ‌ర్యంలో విస్తృత ప్ర‌చారాన్ని క‌ల్పించింది. అంత‌కు ముందే చేనేత కోసం నియ‌మంచిన సమంత‌, ఆమెక‌న్నా ముందు సానియా మీర్జా ఇలా బ్రాండ్ అంబాసిడర్లు ఉండ‌టంతో… ప్ర‌భుత్వం పై ముఖ్యంగా కేటీఆర్ పై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆఫ్ బీట్ లో అయితే… ఇంకా ఎన్నెన్నో క‌థ‌నాలు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే… ఏరీ కొరి తెచ్చుకున్న గ్లామ‌ర్ గ‌ల్స్ వ‌ల్ల ఓరిగింది ఏమీలేదు. సానియా మీర్జాకు కోటి రూపాయ‌ల చొప్పున ఇచ్చారు. కానీ, ఫ‌లితం శూన్యం.

స‌మంతా కూడా ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్ లా అలా వెళ్లి ఇలా చేనేత వ‌స్త్రాల కోసం ఒక‌టి రెండు రోజులు బ‌య‌ట క‌న‌ప‌డ‌టం మిన‌హా పెద్ద‌గా ఒరిగింది ఏమీ లేదు. ర‌కుల్ ప్రీత్ సింగ్ అయితే ఎంత త‌క్కువగా చెప్పుకుంటే అంత న‌యం. పేరుకే బ్రాండ్ అంబాసిడ‌ర్. ఆ పేరుతో… ఆమె అనుభ‌వించింది ఎక్కువ‌, ప్ర‌జ‌ల‌కు ఒరిగింది త‌క్కువ‌.  అందుకే వీరి విష‌యంలో ప్ర‌జ‌ల్లో నానా అపోహ‌లు, అనుమానాలు. పైగా వీటికి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్తుల ఆరోప‌ణ‌లు కూడా చీక‌టి కోణౄలున్నాయి ఉన్నాయంటూ తోడ‌వుతున్నాయి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*