కోదాడ టీఆర్ఎస్ అభ్య‌ర్థి సుదీర్ జ‌ల‌గం?

Read Time: 1 minutes

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుండటంతో… సీట్లు, పోటీదారులు ఎవ‌రు అనే క్లారిటీ వ‌చ్చేస్తుంది. పార్టీలు కూడా ఆయా నేత‌ల‌ను ప‌నిచేసుకొండి అంటూ సూచిస్తున్నాయి. అయితే,  అధికారాన్ని అనుభవించిన టీఆర్ఎస్ పార్టీ… కొన్ని స్థానాల్లో బ‌ల‌మైన అభ్య‌ర్థుల వేట కొన‌సాగిస్తుంది. మ‌రీ ముఖ్యంగా కాంగ్రెస్ లో కీల‌క నేత‌ల ఓట‌మే ల‌క్ష్యంగా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. అందులో ఒక‌టి… ఇంకా అభ్య‌ర్థిని ఖ‌రారు చేయ‌ని స్థానం కోదాడ‌.

పూర్వ‌పు న‌ల్ల‌గొండ జిల్లాలోనే కాదు, యావత్ రాష్ట్రంలో కీల‌క స్థానం ఇది. ఇక్క‌డ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉత్తమ్ భార్య‌, గ‌తంలో ఉత్త‌మ్ ప్రాతినిధ్యం వ‌హించారు. దీంతో… ఈ సీటును ఓడించాల‌నే ల‌క్ష్యం తో టీఆరెఎస్, భారీ గెలుపు కోసం కాంగ్రెస్ ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నాయి. గ‌తంలో ఇక్క‌డ టీఆర్ఎస్ ప‌రిస్థితి చిత్ర‌విచిత్రం. 2014 తెలంగాణ సెంటిమెంట్ వేవ్ లోనే టీఆర్ఎస్ కు వ‌చ్చిన ఓటింగ్ శాతం 7.4, వ‌చ్చిన ఓట్లు 13,404.

దీన్ని బ‌ట్టి అర్థం చేసుకొవ‌చ్చు ఎంత వీకో. పైగా అప్పుడు గ‌ట్టిపోటీ ఇచ్చిన టీడీపీ అభ్య‌ర్థి బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్… ఇప్పుడు మ‌హ‌కూట‌మి త‌రుపున కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు ప‌లుక‌బోతున్నారు. సో… కాంగ్రెస్- మ‌హ‌కూట‌మి ఎంతో బ‌ల‌మైంది అన్న‌మాట‌. అందుకే… ఈ సీటు కోసం టీఆర్ఎస్ పార్టీ, స్థానిక మంత్రిగా ఉన్న జ‌గ‌దీష్ రెడ్డి ఈసారి ఎన్నారైని బ‌రిలోకి దింపే అవ‌కాశం ఉంది. ఇక్క‌డ ఎక్కువ సార్లు వెల‌మ సామాజిక‌వర్గం గెలిచినందున‌… సుధీర్ జ‌ల‌గం అనే ఎన్నారై ఇక్క‌డ పోటీ చేయ‌బోతున్నారు. అతి త్వ‌ర‌లోనే అధికార ప్ర‌క‌ట‌న ఉండ‌నుంది.

అయితే, ఉత్త‌మ్ సపోర్టుతోనే కాదు, స్వ‌త‌హాగా ఉత్త‌మురాలైన‌, విద్యావంతురాలు ప‌ద్మావ‌తి, ఎంతో అభివృద్ధి చేశారు. నిత్యం కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉంటూ… ఉత్త‌మ్ తో స‌మానంగా ఆద‌ర‌ణ‌, అభిమానం సంపాదించుకున్నారు. దీంతో… ఈమెను కాద‌ని, ఎక్క‌డ‌నుండో వ‌చ్చే వ్య‌క్తికి ఓటు వేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఒక‌వేళ ఇదే ఎన్నారై సుధీర్ జ‌ల‌గం కు టికెట్ వ‌స్తే… 60వేల‌కు పైగా మెజారిటీతో గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు. పైగా నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న నేత‌లు కూడా సుధీర్ జ‌ల‌గం ను వ్య‌తిరేకిస్తుండ‌టం మరో చ‌ర్చ‌నీయాంశం.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*