అక్టోబ‌ర్ 3న రేవంత్ అరెస్ట్….?

Read Time: 0 minutes

అక్టోబ‌ర్ 3కు రేవంత్ అరెస్టుకు ఏం సంబందం అనుకుంటున్నారా…?  మాములుగా అయితే ఉండ‌దు, కానీ ఈ అక్టోబ‌ర్ 3కు రేవంత్ కు, ఆయ‌న అభిమానుల‌తో పాటు టీఆర్ఎస్ కు కీల‌కంగా మారింది. కార‌ణం ఆయ‌న ఆ రోజు ఐటీ దాడుల‌పై విచార‌ణ‌కు హ‌జ‌రవ్వ‌బోతున్నారు. సొదాల స‌మ‌యంలో… అధికారులు పోతూపోతూ, వీల్ మీట్ సూన్ అనుకుంటు వెల్లిపోయారు. అయితే, రేవంత్ అరెస్టు ఎవ‌రికీ లాభం, ఎవ‌రికీ న‌ష్టం అన్న‌ది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రేవంత్ అరెస్టుతో టీఆర్ఎస్ మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌నుకుంటొంది. రేవంత్ ను అరెస్టు చేయ‌టం ద్వారా… ఏ పార్టీ అనుకూలంగా మాట్లాడిన అవినీతికి మ‌ద్దతిచ్చిన‌ట్లేన‌ని జ‌నాల్లోకి తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించింది. పైగా టీఆర్ఎస్ పై అవినీతి ఆరోప‌ణ‌లు లేవు. కాంగ్రెస్ నాయ‌కులు మిష‌న్ బ‌గీర‌థ‌, కాక‌తీయ‌, ప్రాజెక్టులు, ఇసుక రవాణాపై ఆరోప‌ణ‌లు చేసినా, అవి ఆన్ పేప‌ర్ ఎవిడెన్స్ లేదు. సో… త‌మ‌కు అవినీతి అంటే కాంగ్రెస్సేన‌ని నిరూపించే ప్ర‌య‌త్నం చేయొచ్చ‌న్న‌ది టీఆర్ఎస్ ఎత్తుగ‌డ‌లా క‌న‌ప‌డుతోంది.

కానీ,  రేవంత్ రెడ్డి అరెస్టు అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంత లాభాన్నే చేకూర్చ‌బోతుంది. సోదాల  రోజున కొడంగ‌ల్ నుండి రేవంత్ బ‌య‌లుదేరుతూ… సెంటిమెంట్ గా త‌న‌ను అరెస్టు చేస్తే, గెలిపించుకోవాల్సిన బాద్య‌త మీదేన‌ని, త‌న కుటుంబం బాద్య‌త కూడా మీద‌నంటూ వ‌చ్చారు. ఆ త‌ర్వాత నిఘా వ‌ర్గాలు ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం… రేవంత్ పై సానుబూతి బాగా పెరిగింద‌ని, టీఆరెఎస్ అభిమానులు కూడా… రేవంత్ విష‌యంలో సానుకూలంగా మాట్లాడారని సీఎంకు నివేధిక అందింది. దీంతో రేవంత్ విష‌యంలో స‌ర్కార్ కూడా పున‌రాలోచ‌న‌లో ప‌డింది.

సో… వీట‌న్నింటిపై టీఆర్ఎస్ పార్టీ అనేక క‌స‌ర‌త్తులు చేస్తోంది. అయితే, ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది ఎత్తులు, పైఎత్తులు మారుతున్నందు… ఐటీ విచార‌ణ‌ను కొద్దిరోజులు వాయిదా వేయించ‌ట‌మో, సాగ‌దీయ‌ట‌మో చేసే ఆలోచ‌న కూడా ఉంద‌ని తెలుస్తుంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*