అమృత్ స‌ర్ రైలు ప్ర‌మాద డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్య‌.

Read Time: 0 minutes

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ స‌ర్ లో రావ‌ణ‌ద‌హ‌నం సంద‌ర్భంగా… జ‌రిగిన రైలు ప్ర‌మాదంలో 60మందికి పైగా చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ రైలు న‌డిపిన లోకో పైలెట్ అర‌వింద్ కుమార్ ఆత్మ‌హాత్య చేసుకోవ‌టం సంచ‌ల‌నంగా మారింది. అర‌వింద్ త‌ప్పులేద‌ని రైల్వేబోర్డు, అధికారులు చెప్తున్నా… మాన‌సిక ఆవేధ‌న‌తోనే త‌ను ఆత్మ‌హాత్య చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ఘ‌ట‌న‌పై ఓ లేఖ కూడా రాశారు అర‌వింద్.

ఆరోజు ట్రైన్ నిర్ణిత స‌మయానికే న‌డుస్తోంది. అక్క‌డ రావ‌ణ ద‌హ‌నం జ‌రుగుతున్న సంగ‌తి తెలియ‌దు. రావ‌ణ ద‌హ‌నం కార్య‌క్ర‌మంపై మాకు ఎలాంటి స‌మాచారం లేదు. దాంతో… నేను ఎప్ప‌టిలాగే, మాములుగా అయితే ఎంత స్పీడ్ తో వెళ్తానో అదే స్పీడ్ తో ట్రైన్ ను న‌డిపాను. కానీ ఒక్క‌సారిగా అంత‌మంది జ‌నాల‌ను చూసే స‌రికి ఏం చేయాలో తోచ‌లేదు. ఎంత హ‌రన్ వేసినా….ఎవ‌రూ వినిపించుకోలేదు. ఆ సౌండ్ కు ట్రైన్ సౌండ్, హ‌ర‌న్ ఎవ‌రికీ విన‌ప‌డ‌లేదు. ఎమ‌ర్జెన్సీ బ్రేకులు వేసిన ఫ‌లితం లేకుండా పోయింది. అలాగ‌ని ఇంకా ఎక్కువ ట్రై చేసినా… ఫ‌లితం ఉండేదో లేదో తెలియ‌దు. ఎందుకుంటే అప్ప‌టికే ట్రైన్ జ‌నాల‌కు ద‌గ్గ‌ర‌గా దూస‌క‌పోతుంది. అలాంటి స‌మ‌యంలో నేనేదైనా రిస్క్ చేస్తే… ట్రైన్ లో ఉన్న 2000మంది ప్ర‌యాణికుల ప్రాణాలు కూడా రిస్క్ లో ప‌డుతాయి. అందుకే ఎక్కువ‌గా రిస్క్ చేయ‌లేక‌పోయాను. ఇందులో నా త‌ప్పిద‌మేమీ లేదంటూ త‌న మ‌ర‌ణ వాగ్మూలాన్ని రాసాడు.

దీన్ని చూసి… అంతా చ‌లించిపోతున్నారు. త‌న త‌ప్పేమీ లేకున్నా… త‌న ప్రాణాలు కూడా బ‌లితీసుకున్నారని ఆవేధ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*