అర‌వింద స‌మేత రివ్యూ బై… రామ్ చ‌ర‌ణ్

Read Time: 1 minutes

అర‌వింద స‌మేత సినిమా యావ‌రేజ్ టాక్ తో ఫ‌స్ట్ వీక్ మంచి క‌లెక్ష‌న్స్ తో సాగుతోంది. సినిమా లైన్ ప‌క్క‌న పెడితే, ఈ సినిమా ద్వారా ఎన్టీయార్, జ‌గ‌ప‌తిబాబుల న‌ట‌న‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇప్ప‌టికే ఈసినిమా చూసి ఎంజాయ్ చేశా అంటూ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కితాబిచ్చారు. తాజాగా… ఎన్టీఆర్ సినిమాపై మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స్పందించారు.

93ba30a9-cf42-48d2-b61d-6975caeb51bd

జూనియ‌ర్ ఎన్టీఆర్ కేరీర్ లోనే అత్యుత్త‌మ న‌టన‌ల్లో ఇది ఒక‌టి. బోల్డ్ స్టోరీ, సూప‌ర్ డైరెక్ష‌న్ తో… మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఆక‌ట్టున్నారు. ఇక జ‌గ‌ప‌తిబాబు న‌ట‌న‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ మ్యూజిక్ సినిమాకు పిల్ల‌ర్స్ గా నిలిచాయి. హీరోయిన్ పూజా హెగ్ధే న‌ట‌న కూడా బాగుంది. అవ‌రింద స‌మేత టీమ్ కు నా అభినంద‌న‌లు అంటూ రామ్ చ‌ర‌ణ్ మూడు లైన్లలో రివ్యూ చెప్పేశాడు. త‌న అఫీషీయ‌ల్ ఫెస్ బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

e4759191-807d-4fd9-923e-dfda20cbbf0b

ఇదిలా ఉంటే, అతి త్వ‌ర‌లోనే ఎన్టీయార్-రామ్ చ‌ర‌ణ్ ల మ‌ద్య మ‌ల్టీస్టార‌ర్ సినిమా తెర‌కెక్క‌బోతుంది. సూప‌ర్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌టంతో… సినిమాపై అంచ‌నాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*