అర‌వింద స‌మ్మ‌త‌మే…

Read Time: 1 minutes

తెలుగు సినిమా అంటే నాలుగు పాట‌లు, ఒక్క ఐట‌మ్ సాంగ్, ఐదుగురు క‌మెడియ‌న్ లు , ఒక్క రిచ్ హీరో, ఒక‌రు లేదా ఇద్ద‌రు హీరోయిన్స్ తో ప్రేమనో, ఫాక్ష‌న్ బ్రాక్ గ్రౌండో ఉంట‌ది. కానీ అర‌వింద స‌మేతను త్రివిక్ర‌మ్ కొత్త‌గా మార్చాడు. ఎంత కొత్త‌గా అంటే… అదే ఫాక్ష‌న్ లో… యుద్దం చేయ‌టం కన్నా నివారించ‌టం తెలివైన ల‌క్ష‌ణ‌మ‌న్న పాయింట్ తో. దానికి తోడు ఇన్నాళ్లు చూపించిన ఫాక్ష‌న్ లోనే లేడీ సెంటీమెంట్ ను అద్భుతంగా పండించ‌గ‌లిగాడు.

ఇక ఎన్టీఆర్, జ‌గ‌ప‌తిబాబు త‌మ న‌ట‌నా సామ‌ర్ధ్యంలో కొత్త కొణాన్ని చూపించ‌గ‌లిగారు. నువ్వా-నేనా అన్న‌ట్లు పోటీప‌డి న‌టించి, సినిమాను ర‌క్తిక‌ట్టించారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో  న‌వ‌ర‌సాల‌ను పండించ‌టంలో స‌ఫ‌లం కాగా, జ‌గ‌ప‌తిబాబు- ఎన్టీఆర్ లు అచ్చ‌మైన రాయ‌ల‌సీమ బాష‌ను అవ‌లీల‌గా న‌టించారు. సినిమా ఆద్యాంతం ఎక్క‌డా…  రియాల్టీమిస్ కాకుండా చూసుకున్నారు. సినిమా మొద‌ట్లో ఎన్టీఆర్ పై ఉన్న ఫైట్ సీన్ సినిమాకే హైల‌ట్.

అయితే, హీరోయిన్ పాత్ర కేవ‌లం నామ‌మాత్ర‌మే అని చెప్పుకోవ‌చ్చు. ఇక కామెడీ కోసం… రీ ఎంట్రీ ఇచ్చిన త్రివిక్ర‌మ్ ఫ్రెండ్… సునీల్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ప‌నికి వ‌చ్చాడు. అయితే, కామెడీ కావాలి అనుకునే వారు మాత్రం సినిమాకు వెళ్ల‌టం మానుకోవాల్సిందే. సెంటిమెంట్, న‌ట‌న కోసం అయితే సినిమా మిస్ కాకుండా చూడాల్సిందే.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*