ఆడ‌ప‌డుచు కాదు… తెలంగాణ శ‌శిక‌ళ‌.

Read Time: 0 minutes

ఎంపీ క‌విత‌పై మ‌రోసారి తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు మాజీ ఎంపీ మ‌దుయాష్కీ. క‌విత త‌మిళ‌నాడు త‌ర‌హా జ‌య‌ల‌లిత‌గా మారిందంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణలో సీమాంధ్రులను నిన్నటి వరకు కేసీఆర్ తిట్టారని, ఇప్పుడు కేటీఆర్ వారిపై ప్రేమ ఒలకబోస్తున్నారని  విమర్శించారు.

ప్ర‌త్యేక హెదా ఆంద్రుల హ‌క్క‌ని… అలాంటి హ‌క్కును బీజేపి ప్ర‌భుత్వం దూరం చేస్తుంటే, పోరాడుతున్న ఏపీ ఎంపీల‌కు ఎందుకు అండ‌గా ఉండ‌లేక‌పోయార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ‌లో ఉన్న విద్యార్థుల‌కు చదువుకు దూరం చేసేలా, సీమాంద్రుల పిల్ల‌ల‌కు ఇబ్బంది క‌లిగేలా… కేసీఆర్ ప్ర‌భుత్వం తెచ్చిన ఫాస్ట్ ప‌థ‌కం నిజం కాదా అంటూ ప్ర‌శ్నించారు. తమ పిల్ల‌ల‌ను చ‌దువుల‌కు దూరం చేసిన కేసీఆర్ కు, కేటీఆర్ ఓట్ల‌డిగితే ఎలా వేస్తార‌ని ప్ర‌శ్నించారు. అమ‌రావ‌తికి 100కోట్లు ఇద్దామ‌నుకుంటున్నాం అంటూ… కేటీఆర్ చేసిన ప్ర‌సంగం ఆంద్రుల‌ను అవ‌మానించ‌ట‌మేన‌ని, మీరు త‌ల‌కిందుల త‌పస్సు చేసినా మీకేవ‌రికి ఓట్లు ప‌డ‌వంటూ దుయ్య‌బ‌ట్టారు.

ఇన్నాళ్లు నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న సీమాంద్రుల ఓటెవ‌రికి అంశం… మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. టీఆర్ఎస్ అనుస‌రిస్తున్న వైఖ‌రే ఇందుకు కార‌ణ‌మ‌న్న వాద‌న‌లు రోజురోజుకి పెరుగుతున్నాయి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*