ఆన్ లైన్ లో మ‌ద్యం, ఫ్రీ డోర్ డెలివ‌రీ

Read Time: 0 minutes

అదేంటి ఆన్ లైన్ లో మ‌ద్యం దొర‌క‌టం ఏమిటీ…? ఇదేమైనా కొత్త ఆప్ వ‌చ్చిందా…?  పైగా ఫ్రీ డెలివ‌రీ హ‌….? ఎంచ‌క్కా కూర్చున్న ద‌గ్గ‌ర‌కే తెప్పించుకోవ‌చ్చు అని ఎగిరి గంతేయ‌కండి. మ‌ద్యం ప్రియులు డ్రంక‌న్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డటం, ప్ర‌భుత్వాలు విమ‌ర్శ‌లు పాలు కావ‌టంతో… మ‌హ‌రాష్ట్ర మ‌ద్యం మంత్రికి కొత్త ఆలోచ‌న వ‌చ్చింది. బార్ కు వెళ్లో, వైన్ షాప్ కు వెళ్లో… మ‌ద్యం తాగ‌టం, డ్రైంక‌న్ డ్రైవ్ లు, ఆక్సిడెంట్స్ ఇవ‌న్నీ ఎందుకు అనుకున్నారో ఏమో… కొత్త ఆలోచ‌న‌ను బ‌య‌ట‌పెట్టారు. అదే ఆన్ లైన్ లో మ‌ద్యం, పైగా ఫ్రీ డోర్ డెలివ‌రీ. ఇలా అయితే… ఇంటికే పంపియోచ్చు, చిక్కులుండ‌వు.

మీరే బార్ల‌కు, వైన్స్ షాపుల‌కు ప‌ర్మిష‌న్స్ ఇస్తారు, తాగి వెళ్తుంటే…  డ్రంక‌న్ డ్రైవ్ పేరుల‌తో ఇబ్బందిపెడుతారు, ఇది ఏక్క‌డి న్యాయం అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే, దీనిపై తాము అనేక ఆలోచ‌న‌లు చేసి… ఒక నిర్ణ‌యం తీసుకోబోతున్నాము. త్వ‌ర‌లోనే ఆన్ లైన్ లో మ‌ద్యం అమ్మెలా చ‌ర్య‌లు తీసుకొంటాము. డోర్ డెలివ‌రీ స‌దుపాయం క‌ల్పిస్తామ‌ని మ‌హ‌రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి ప్ర‌క‌ట‌న చేశారు.

ఆయ‌న అలా ప్ర‌క‌టించారో లేదో… ఆలోచ‌న ఉంది అన‌గానే మ‌హిళా సంఘాలు, ప్ర‌జాసంఘాలు ముంబైలో ఆందోళనకు శ్రీ‌కారం చుట్టాయి. అన్నివైపుల నుండి తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌టం, ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేళ‌… మ‌హ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఫ‌డ్నవీస్ దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అలాంటిదేమీ లేద‌ని… ఆన్ లైన్ లో స‌ప్లై చేసే ఆలోచ‌నే లేద‌ని స్ప‌ష్టం చేశారు. మంత్రిని కూడా వివ‌ర‌ణ అడుగుతామ‌ని తెలిపారు. దీంతో మంత్రి కూడా నాలుక‌ర్చుకున్నారు.

మొత్తానికి మ‌హ‌రాష్ట్ర మద్యం మంత్రి… ఆన్ లైన్ లో మ‌ద్యం ప్ర‌క‌ట‌న దేశవ్యాప్త చ‌ర్చ‌కు దారితీసింది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*