ఆశావాహుల జాబితాతో డిల్లీకి ఉత్తమ్.

Read Time: 1 minutes

ఓవైపు… ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టం, మ‌రోవైపు కూట‌మిలో సీట్ల పీట‌ముడి ఇంకా కొల‌క్కి రాక‌పోవ‌టంతో… ఆల‌స్యం చేస్తే మొత్తానికే ప్ర‌మాదం ఉంద‌ని గ్ర‌హించిన పీసీసీ చీఫ్ ఉత్త‌మ్, 75 మంది జాబితాతో డిల్లీకి చేరిన‌ట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ మ‌హ‌కూట‌మి పొత్తుల్లో భాగంగా…90కిపైగా స్థానాల్లో పోటీచేయాల‌ని భావించింది. అయితే… ఏయేస్థానాలు అనే వాటిపై చ‌ర్చ సంద‌ర్భంగా, కొన్నింటిపై టీజెఎస్-టీడీపీ-సిపిఐలు ప‌ట్టుబ‌డుతుండ‌టంతో, స‌మ‌స్య జ‌ఠిలంగా మారుతోంది. దీంతో…. ఇంకా ఆల‌స్యం చేస్తే, అబ్య‌ర్థులు ప్ర‌చారం చేసుకోవ‌టంలో వెనుక‌బ‌డుతారని గ్ర‌హించిన పీసీసీ చీఫ్ 75మందితో తొలిజాబితా సిద్ధం చేశారు. వీటిలో 40 నుండి 45 అబ్య‌ర్థుల‌తో తొలిజాబితా విడుద‌ల చేయాల‌ని భావిస్తూ, ఆ జాబితా పై అధిష్టానం ఆమోద‌ముద్ర వేయించ‌నున్నారు. దీంతో… తీవ్రంగా పోటీ ఉన్న స్థానాల్లో ఎవ‌రికీ సీట్లు ద‌క్కుతాయ‌నే దానిపై స‌ర్వత్రా ఉత్కంఠ కొన‌సాగుతుండ‌గా, గెలిచేవారికే టికెట్లు కేటాయించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. న‌వంబ‌ర్ 2 మొద‌టి జాబితా విడుద‌ల చేయాల‌ని, ఈలోపే కూట‌మి ప‌క్షాల‌తో కూడా చర్చించాల‌ని నిర్ణ‌యించ‌న‌ట్లు స‌మాచారం.

అయితే, సీట్ల కేటాయింపు ఇంకా పూర్తికాక ముందే… కాంగ్రెస్ పార్టీ అబ్య‌ర్థుల‌ను ఎలా ప్ర‌క‌టిస్తార‌ని మ‌హ‌కూట‌మిలోని కాంగ్రెసేత‌ర ప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి. గాంధీబ‌వ‌న్ నుండి అబ్య‌ర్థుల పేర్లంటూ వ‌స్తున్న లీకుల‌ను నివారించాల‌ని కోరుతున్నాయి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*