ఆ మూడు సీట్లే… కూట‌మిలో హ‌ట్ కేక్ సీట్లు.

Read Time: 1 minutes

మ‌హ‌కూట‌మిలో సీట్ల సంఖ్య‌పై ఓ అంచ‌నాకు వ‌చ్చిన ఆయా పార్టీలు, ఇప్పుడు ఎవ‌రెక్క‌డ పోటీచేయాల‌న్న దానిపై దృష్టిసారించారు. అయితే, గెలిచే సీట్ల‌పైనే అన్ని పార్టీలు క‌న్నేయ‌టంతో స‌మ‌స్య మ‌ళ్లీ మొద‌ల‌వుతుంది. కానీ, ఈ మొత్తం సీట్ల వ్య‌వ‌హ‌రంలో ఆ 3 సీట్లపైనే అన్ని పార్టీలు దృష్టిపెట్టాయి.

గ్రేట‌ర్ ప‌రిధిలోని కూక‌ట్ ప‌ల్లి, శేరిలింగం ప‌ల్లి, ప‌టాన్ చెఱు నియోజ‌క‌వ‌ర్గాలపైనే అన్ని పార్టీల చూపు. అయితే, కూక‌ట్ ప‌ల్లి, శేరిలింగం ప‌ల్లిలో ఆంద్రానుండి వ‌చ్చి, సెటిల‌యిన వారు ఎక్కువ‌. అందుకే అక్క‌డ 2014లో తెలంగాణ వేవ్ లోనూ టీడీపీ అబ్య‌ర్థులు గెలిచారు. దీంతో ఆ రెండు త‌మ‌కే కేటాయించాల‌ని టీడీపీ వాదిస్తుండ‌గా, అద‌నంగా పటాన్ చెఱు ఇవ్వాల‌ని ప‌ట్టుబడుతుంది. అయితే ఈ మూడు మిత్ర‌ప‌క్షాల‌కే ఇవ్వ‌టానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. శేరిలింగంప‌ల్లిలో గ‌తంలో త‌మ‌కు ప‌ట్టుంద‌ని, ఆ సీటు ఇస్తే… కూక‌ట్ ప‌ల్లి స‌హ ప‌టాన్ చెఱు ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌ని తెలుస్తుంది.

అయితే, పటాన్ చెఱు పై టీజెఎస్ కూడా ఆశ‌లు పెట్టుకుంది. పైగా కాంగ్రెస్ కే పటాన్ చెఱు ఉండాల‌ని విజ‌యశాంతి, రేవంత్ అనుచ‌రులు గ‌ట్టిగా ప‌ట్టుబ‌డుతున్నారు. దీంతో స‌మ‌స్య జ‌ఠిలంగా మారింది. కానీ గ‌తంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న నందీశ్వ‌ర్ గౌడ్ ప‌టాన్ చెఱుపై హ‌మీతోనే టీడీపీలో చేరారు. దీంతో శేరిలింగంప‌ల్లి టీడీపీ వ‌దులు కోవాల్సి ఉంది. ఇక కూక‌ట్ ప‌ల్లి నుండి ఈసారి టీడీపీ త‌రుపున మాజీమంత్రి పెద్దిరెడ్డి పోటీలో ఉండే అవ‌కాశం ఉంది. కానీ శేరిలింగంప‌ల్లి నుండి ఖ‌మ్మ సామాజిక‌వర్గ అభ్య‌ర్థిని నిలిపితే బాగుంటుంద‌న్న‌ది చంద్ర‌బాబు ఆలోచ‌న‌.

అయితే, శేరిలింగం ప‌ల్లి నుండి కాంగ్రెస్, కూక‌ట్ ప‌ల్లి-ప‌టాన్ చెఱు నుండి టీడీపీని బ‌రిలో ఉంచాల‌ని డిసైడ్ అయిన‌ట్లు తెలుస్తోంది

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*