ఆ రెండు జాతీయ పార్టీల‌ది ఒకే ఫార్మూలా….

Read Time: 0 minutes

ఆ రెండు జాతీయ పార్టీలే. వాటి ఆలోచ‌న‌లు ఒకే తీరుగా ఉన్న‌ట్లు క‌న‌ప‌డుతోన్నాయి. ఒ పార్టీ రాష్ట్రంలో అధికారం కోసం, మ‌రోపార్టీ వ‌చ్చే లోక్ స‌భ‌ ఎన్నిక‌ల రిహ‌ర్స‌ల్ గా భావిస్తున్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒక‌టి, స‌హ‌క‌రించిన పార్టీగా ఒక‌టి. పోటాపోటీగా ఒకే ఫార్మూలాను వ‌ర్క‌వుట్ చేసే ప‌నిలో ఉన్నాయి కాంగ్రెస్, బీజేపిలు.

ఆ రెండు పార్టీల‌కు రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల క‌న్నా, వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో వీలైన‌న్ని ఎక్కువ సీట్లు సాధించే ప‌నిలో త‌ల‌మున‌క‌ల‌య్యాయి. అందుకు ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో త‌మ ఓటు బ్యాంకు అంచనా వేసే ప‌నిలో ఉన్నాయి. అందులో భాగంగానే ఎంపీలుగా ప‌నిచేసిన వారితో పాటు, వ‌చ్చే లోక్ స‌భ బ‌రిలో ఉండే నేత‌ల‌తో అసెంబ్లీకి పోటీచేయిస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో సొంత పార్టీలోనే కొట్లాడిన పేరుంది. పొన్నం ప్ర‌భాక‌ర్, మ‌దుయాష్కీ వీరిలో ముందువ‌రుస‌లో ఉంటారు.  త‌ద్వారా టీఆరెస్ కు మ‌రింత పోటీ ఇవ్వొచ్చ‌న్న‌ది వారి ఆలోచ‌న‌. బీజేపి కూడా 3 నుండి 5 లోక్ స‌భ సీట్లు గెల‌వాల‌ని ప్లాన్ చేస్తుండ‌గా, ఈసారి రెండంకెల సీట్లు సాధించాల‌ని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఎంపీ డిఎస్ కొడుకు ధ‌ర్మ‌పురి అర‌వింద్ నిజామాబాద్ ఎంపీగా పోటీచేయ‌బోతుండ‌గా, ఇప్పుడు నిజామాబాద్ రూర‌ల్ లేదా అర్భ‌న్ నుండి అసెంబ్లీ బ‌రిలో ఉంటారు. వీరే కాదు…మరికొంత మందిని జ‌ల్లెడ పట్టే ప‌నిలో బిజీగా ఉంది బీజేపి.

ఇట్లా ఒకే ఫార్మూల‌తో… భ‌విష్య‌త్ రాజ‌కీయాల కోసం రెండు జాతీయ పార్టీలు ఇప్ప‌టి నుండే ఆలోచ‌న చేయ‌టం గ‌మ‌నార్హం.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*