ఈసారి త‌మిళంపై శ్రీ‌రెడ్డి గురి.

Read Time: 0 minutes

తెలుగులో… సినిమాలోనే కాదు, రాజ‌కీయరంగంలో ఉన్న వారిపై లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన శ్రీ‌రెడ్డి, మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఇప్ప‌టికే ఆర్మూర్ తాజామాజీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి త‌న‌ను పార్క్ హ‌య‌త్ హోట‌ల్ గ‌దికి ర‌మ్మ‌న్నాడంటూ సంచ‌ల‌నం సృష్టించింది. మ‌రో కీల‌క లీడ‌ర్ కూడా జీవ‌న్ రెడ్డితో ఉన్నాడ‌ని… అయితే ఆ లీడ‌ర్ ఎవ‌ర‌న్న‌ది బ‌య‌ట‌పెట్ట‌లేదు.

ఈసారి త‌మిళ్ సినిమాపై శ్రీ‌రెడ్డి దృష్టి ప‌డ్డ‌ట్లుంది. త‌మిళ్ లో ప్ర‌ముఖ న‌టుడు, త‌మిళ సిని మండ‌లి న‌డిగ‌ర్ సంఘంలో కీల‌క వ్య‌క్తిపై ఆరోప‌ణ‌లు గుప్పించింది. నువ్వు పైకి బాగానే మాట్లాడుతున్న‌వ్, మిస్ట‌ర్ ప‌రెఫెక్ట్ లా ఫోజులిస్తున్నావ్… నీ బండారం బ‌య‌ట‌పెడుతా, ఆధారాలు కూడా సంపాదించా అంటూ కామెంట్స్ చేసింది. దీంతో త‌మిళ సినిమా రంగం ఆవ్య‌క్తి ఎవ‌రా అని చ‌ర్చించుకుంటుండ‌గానే, మ‌రో బాంబు పేల్చింది. ఆ న‌టుడు మంగ‌ళ‌వారం తెగ స్పీచ్ లు ఇస్తున్నాడ‌ని, అంతా చూస్తున్నా… బ‌య‌ట‌పెడుతా అంటూ వార్నింగ్ ఇచ్చింది.

ఇప్ప‌టికే… త‌మిళ్, తెలుగు ఇండ‌స్త్రీలో శ్రీ‌రెడ్డి వ్య‌క్తుల టార్గెట్ గా ఆరోప‌ణ‌లు చేసింది. కొన్నింటికి ఆధారాలు కూడా బ‌య‌ట‌పెట్టింది. బ‌డా నిర్మాత సురేష్ బాబు కొడుకు త‌న‌తో ఉన్న పోటోల‌ను గ‌తంలోనే బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*