ఉత్త‌మ్, కోమ‌టిరెడ్డిల‌కు భ‌ద్ర‌త పెంపు…?

Read Time: 0 minutes

తెలంగాణ కాంగ్రెస్ లో కీల‌క నేత‌లుగా ఉన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్, మాజీ మంత్రి కోమ‌టిరెడ్డిలు స‌హా ముఖ్య‌మైన నేత‌ల‌కు భ‌ద్ర‌త పెంచాల‌ని కాంగ్రెస్ నేత‌లు డీజీపీని క‌లిశారు. ప్ర‌చారంలో రాష్ట్రమంతా తిరిగ‌నున్న ఉత్త‌మ్ కు జెడ్ క్యాట‌గిరి భ‌ద్ర‌తతో పాటు, బుల్లెట్ ఫ్రూఫ్ వాహ‌నం, ఎస్కార్ట్ క‌ల్పించాల‌ని కోరారు.

ఇక పార్టీ  సీనీయ‌ర్ నేత‌, మాజీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి 4+4 భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని, పార్టీ క్యాంపెయినింగ్ క‌మిటీ చైర్మ‌న్ భ‌ట్టివిక్ర‌మార్క‌తో పాటు మాజీ ఎంపీలు మ‌ధుయాష్కీ, అంజ‌న్ కుమార్ యాధ‌వుల సెక్యూరిటీ విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త తీసుకొని… భ‌ద్ర‌త పెంచాల‌ని కోరుతూ లేఖ అందించారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భ‌ద్ర‌త‌పై డీజీపి స్పందించ‌టం లేదంటూ… కోర్టుకెక్క‌గా, 4+4 కేంద్ర బ‌ల‌గాల భ‌ద్ర‌త ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది. అయితే, తాజా లేఖ‌పై డీజీపై వెంట‌నే స్పందిస్తూ…. త‌మ‌కు ఉన్న చ‌ట్టం ప‌రిధిలో నేత‌లంద‌రికీ భ‌ద్ర‌త‌ను కొనసాగించ‌టంతో పాటు, ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించి…. అవ‌స‌మ‌రైతే పెంచుతామ‌ని, మీరు ఆందోళ‌న చెంద‌వ‌ద్దంటూ నేత‌ల‌తో తెలిపారు. ఎన్నిక‌ల‌య్యే వ‌ర‌కు త‌మ సెక్యూరిటీపై పూర్తి స్థాయిలో అలెర్ట్ గా ఉంటామ‌ని తెలిపారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*