ఉలిక్కిప‌డుతున్న కేసీఆర్… ఏపీ నుండి బందోబ‌స్తుకు నై

Read Time: 1 minutes

కేసీఆర్ కు ఎన్నిక‌ల భ‌యం పట్టుకుందా… అందుకే డిల్లీ టూర్, ఏపీ పోలీసుల బందోబ‌స్తు వ‌ద్దంటూ ఈసీకి ఫిర్యాదు చేశారా… కాంగ్రెస్ కూట‌మి గ్రాఫ్ ను కేసీఆర్ ఊహించ‌లేదా… అంటే ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది.

ఒవైపు ఎన్నిక‌లు ముంచుకొస్తుండ‌టంతో, కూటమి గ్రాఫ్ పెరుగుతుంద‌న్న స‌ర్వేల రిపోర్టుల‌తో… కేసీఆర్ ఇత‌ర వ్యూహాల‌కు ప‌దునుపెట్టాడు. ఓవైపు చంద్ర‌బాబును క‌ట్ట‌డి చేయ‌టంతో పాటు, ఏపీ నుండి వ‌స్తోంద‌ని ఆరోపిస్తున్న ఆర్థిక వ‌న‌రుల నిలువ‌రింత‌కు ఇప్ప‌టికే మోడీ త‌లుపుత‌ట్టారు. మోడీ ఆత్మీయుల‌తో… స‌మాచారాన్ని చేర‌వేసి డిల్లీ నుండి హైద‌రాబాద్ చేరారు. అయితే… ఇటు ఈ వ్యూహాలు వేస్తూనే, తెలంగాణ ఎన్నిక‌ల‌కు ఇత‌ర రాష్ట్రాల నుండి బందోబ‌స్తుకు తీసుకునే విష‌యంలో… ఏపీ పోలీసులు వ‌ద్దంటూ టీఆర్ఎస్ పార్టీ నుండి ఈసీకి అబ్యంత‌రాన్నితెలిపాడు. అస‌లు పోలీసుల‌కు ఎన్నిక‌లకు ఏం  సంబందం అనే సందేహం అంద‌రికీ కలుగుతోంది. ఏపీ పోలీసుల‌తో కేసీఆర్ ఆయ‌న‌కు అనుకూలంగా మ‌ల్చుకుంటున్నారు అన్న‌ది వారి వాద‌న‌. కానీ ప్ర‌జ‌లు అంత తెలివి త‌క్కువ‌గా ఉన్నార‌న్న ప్ర‌శ్న ఎదురైతుండ‌గా, మ‌రీ దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపి-కాంగ్రెస్ ప్ర‌భుత్వాలే అధికారంలో ఉన్నాయి. మ‌రిని వారిని కూడా వ‌ద్దంటే… అప్పుడు ఈసీ ప‌రిస్థితి ఏంటీ అని ప్ర‌తి వ్య‌క్తికి వ‌చ్చే సందేహమే. కానీ కేసీఆర్ కు అవేవి పట్ట‌డం లేదు. ఇక ఈసీ కూడా… ఓ ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీ అబ్యంత‌రం వ్య‌క్తంచేస్తున్న నేప‌థ్యంలో, స‌రే అన‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఇలా కేసీఆర్… ఓడుతాన‌న్న ఒత్తిడిలో ఏం చేస్తున్నాడో త‌న‌కే అర్థం కావ‌టం లేద‌ని, అధికారం కోస‌మే కేసీఆర్ తాప‌త్ర‌య‌ప‌డుతున్నార‌ని సొంత‌పార్టీ నేత‌లే గుస‌గుస‌లాడుతున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*