ఎన్టీఆర్ తో మ‌హేష్…. అయ్యే ప‌నేనా?

Read Time: 1 minutes

మ‌హ‌ర్షి సినిమా షూటింగ్ తో అమెరికాలో బిజిబిజ‌గా ఉన్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ కోసం ఎన్టీఆర్ ఎదురుచూపులు చూస్తున్నారు. కానీ మీరు అనుకుంటున్న‌ట్లు ఇదేదో రామ్ చ‌ర‌ణ్-ఎన్టీఆర్ త‌ర‌హా మ‌ల్టీస్టార‌ర్ చిత్రం కాదండోయ్…. ఇప్ప‌టికే సెట్స్ లో ఉండి, శేర‌వేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ ముచ్చ‌ట్లు.

అవును.. మీరు చ‌దువుతుంది నిజ‌మే. ఎన్టీఆర్ బ‌యోపిక్ చిత్రం షూటింగ్ కొన‌సాగుతోంది. ద‌ర్శ‌కుడు క్రిష్-బాల‌య్య ఇప్ప‌టికే చాలా వ‌ర్క్ కంప్లీట్ చేశార‌ట‌. అప్పుడప్పుడు మ‌ద్య‌లో ఒక్కో ఫోట్ బ‌య‌ట‌కు వ‌దులుతూ… చిత్రం పై అంచ‌నాలు రోజు రోజుకు పెంచేస్తుంది చిత్ర యూనిట్.

అయితే, ఎన్టీఆర్ బ‌యోపిక్  మొద‌టి పార్ట్ లో… ఎన్టీఆర్- కృష్ణ‌ల మ‌ద్య స్నేహ బంధం కూడా చూపించ‌బోతున్నారు. అందుకోసం.. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో సూప‌ర్ స్టార్ కృష్ణ గెట‌ప్ కోసం మ‌హేష్ ను సంప్ర‌దించార‌ట బాలయ్య‌. కానీ దానిపై ఇంత‌వ‌ర‌కు మ‌హేష్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ట‌. దీంతో… మ‌హేష్ కోసం వేయిట్ చేయాలో లేక ఇంకెవ‌ర్న‌యినా… అనుకోవాలో అర్థంకాక మ‌హేష్ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తోంది చిత్ర యూనిట్. అయితే… చిత్రం కోసం మ‌హేష్ ఒకే చెప్తే… కాస్త ముందో వెన‌కో… కంప్లీట్ అవుతుంది, కానీ మ‌హేష్ అంటే ఏంటీ….? అన్న‌దానిపై బాల‌య్య‌కు కూడా ఇంకా క్లారిటీ లేద‌ట‌. కాకపోతే… మ‌హేష్ నో చెప్ప‌రు అన్న దీమాతో ఉన్నారు బాలయ్య- క్రిష్. చూడాలి మ‌రీ… అమెరికా నుండి బాల‌య్య కు ఎప్పుడు ఫోన్ వ‌స్తుందో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*