ఎన్టీఆర్– రామ్ చ‌ర‌ణ్ మూవీ అప్ డేట్.

Read Time: 1 minutes

తెలుగు సినిమాను జాతీయ  స్థాయి దాటించి, మెప్పించిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. బాహుబ‌లి సినిమాతో బాక్సాఫీస్ ను బ‌ద్ద‌లు కొట్టిన ఈ ధీరుడు, ఇప్పుడు కొత్త సినిమా కు కొబ్బ‌రికాయ కొట్ట‌బోతున్నాడు. ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తిచేసిన రాజ‌మౌళి… భారీ చిత్రానికి రెడీ అయిపోయాడు.

ఎన్టీఆర్- రామ్ చ‌ర‌ణ్ ల‌తో రాజ‌మౌళి ఓ మ‌ల్టీస్టార‌ర్ నిర్మించ‌బోతున్నాడ‌న్న‌ది తెలిసిందే.  RRR గా అభిమానులు నామ‌క‌ర‌ణం చేసుకున్న ఈ ముగ్గురు మొన‌గాళ్లు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. రామ్ చ‌ర‌ణ్ హీరోగా, ఎన్టీఆర్ విల‌న్ గా న‌టిస్తున్న ఈ సినిమా అతి త్వ‌ర‌లోనే ప్రారంబిస్తామంటూ చిత్ర యూనిట్ స‌మాచారం అందించింది. బాహుబ‌లి తర్వాత రానున్న సినిమా కావ‌టంతో… సినిమా  ఎలా ఉండాలి అన్న దానిపై ఓ క్లారిటీకి కూడా వ‌చ్చారు. ఈ సినిమాలో తెర‌కెక్కించ‌బోయే ఓ సీన్ కోసం ఏకంగా 45 రోజుల పాటు క‌ష్ట‌ప‌డనున్నారు. కేవ‌లం ఒకే ఒక్క సీన్ కోసం…45 రోజులు అంటే ఈ సీన్ సినిమాకే హైలెట్ కాబోతుందున్న మాట‌. ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒ అప్డేట్ తో నిత్యం వార్త‌ల్లో నిలిచేలా…. చిత్ర యూనిట్ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో వెళ్తుందంటున్నారు సీనీ క్రిటిక్స్.

అయితే… ఈ వార్త‌లేవి అధికారికంగా ప్ర‌క‌టిస్తున్న‌వి కాదండోయ్.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*