ఎన్టీయార్ బ‌యోపిక్ లో కేసీఆర్, కేటీఆర్

Read Time: 0 minutes

అవును. మీరు చ‌దువుతుంది నిజ‌మే… అలాన‌టి సూప‌ర్ న‌టుడు, ప్ర‌జ‌ల మ‌నిషిగా పేరుతెచ్చుకున్న నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత చ‌రిత్ర ఆధారంగా ఎన్టీయార్ బ‌యోపిక్ తెర‌కెక్కుతుంది. ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ సినిమాను తీర్చిదిద్దుతుండ‌గా, ప‌లువురు సీనీయ‌ర్ న‌టులు ఇందులో ఉన్నారు. అయితే ఇది రెండు భాగాలుగా ప్ర‌జ‌ల ముందుకు రాబోతుంది. ఫ‌స్ట్ పార్ట్ లో ఎన్టీయార్ సినిజీవితం ఉండ‌బోతుండ‌గా, సెకండ్ పార్ట్ లో రాజ‌కీయ జీవిత స‌న్నివేశాలుండ‌నున్నాయి.

మొద‌టిది ఈ ద‌స‌రా త‌ర్వాత‌, రెండో పార్ట్ మూడు వారాల గ్యాప్ త‌ర్వాత రిలీజ్ కాబోతుంది. అయితే… సెకండ్ పార్ట్ లో కేసీఆర్, కేటీఆర్ పాత్ర‌లు కూడా ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో ఎన్నో కీల‌క‌ప‌ద‌వుల్లో ఉన్నారు. సంస్థాగ‌త నిర్మాణంలో కేసీఆర్ పాత్ర‌పెద్ద‌ది. అందుకే ఆయ‌న పాత్ర ఉండ‌నుంది. ఇక కేసీఆర్ ఎన్టీరామారావు పై ఉన్న ప్రేమ‌తో త‌న కొడుక్కు స్వ‌యంగా… తార‌క రామారావు అని పేరుపెట్టుకున్నారు. బ‌హుషా రాజ‌కీయా నాయ‌కుల్లో ఈయ‌న ఇలా కొడుక్కు పేరు పెట్టుకున్న నాయ‌కుడు. అందుకే కేటీఆర్ పాత్ర‌ను కూడా సినిమాలో చేర్చుతున్నార‌న్న టాక్ బ‌లంగా వినిపిస్తోంది. దీనిపై ద‌ర్శ‌కుడు క్రిష్ ఇప్ప‌టి వ‌ర‌కు పెద‌వి విప్ప‌కున్నా, నిజ‌మేనంటున్నాయి… ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు. అయితే కేసీఆర్ క్యారెక్ట‌ర్ మ‌రీ పెద్ద‌గా ఉండే అవ‌కాశం లేదు. కేటీఆర్ ది కూడా అలా చూపించి, త‌ప్పించే స‌న్నివేశ‌మేనంటున్నాయి ఆ సినిమా వ‌ర్గాలు.

ఎప్పుడెప్పుడా అన్న‌ట్లు ఎదురుచూస్తున్న ఎన్టీయార్, తెలుగుదేశం అభిమానుల ముందుకు అతిత్వ‌ర‌లోనే రాబోతుంది బ‌యోపిక్.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*