ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు…… మ‌ళ్లీ జోష్ లో నంద‌మూరి అభిమానులు

Read Time: 1 minutes

నంద‌మూరి హీరోలు ఒకే వేధిక‌పై క‌నిపించి ఎన్ని రోజులైంది, మ‌ళ్లీ ఎప్పుడు క‌నిపిస్తారా… అస‌లు క‌నిపించే చాన్స్ ఉందా… ఇలాంటి వార్త‌ల‌కు ఇక్ చెక్ పెట్ట‌బోతున్నారు నంద‌మూరి హీరోలు. బాల‌య్య‌, ఎన్టీఆర్ ల మ‌ద్య చాలాకాలంగా గ్యాప్ ఉంద‌నే విష‌యం ఇండ‌స్ట్రీలో అంద‌రికీ తెల‌సిందే.

కొంత‌కాలం క్రితం నంద‌మూరి హ‌రిక్రిష్ణ మృతి త‌ర్వాత‌, నంద‌మూరిలో వారింట బాల‌య్య- హ‌రికృష్ణ కొడుకుల మ‌ద్య దూరం అంద‌రికీ స్ప‌ష్టంగా క‌న‌ప‌డింది. బాల‌య్య‌, చంద్ర‌బాబు ఆ తేడా బ‌య‌ట‌కు పొక్క‌కుండా ఎంత జాగ్ర‌త్తప‌డ్డా త‌ప్ప‌లేదు. అయితే… వీట‌న్నింటికి చెక్ పెట్ట‌టంతో పాటు, కుటుంబ‌పెద్ద‌గా బాల‌య్య‌కు ఇదో స‌రైన అవ‌కాశంగా ప‌రిణ‌మించింది.

ఇటీవ‌లే విడుద‌లైన ఎన్టీఆర్ న‌టించిన అర‌వింద‌స‌మేత వీర‌రాఘ‌వ చిత్రం మంచి టాక్ తో స‌క్సెస్ ఫుల్ గా దూస‌క‌పోతోంది. ఈచిత్రం ఆదివారం స‌క్సెస్ మీట్ నిర్వ‌హించ‌బోతుండ‌గా, ఆ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా బాల‌య్య‌బాబు రాబోతున్నారు. క‌ళ్యాణ్ రామ్ అతిక‌ష్ట‌మ్మీద బాల‌య్య‌ను ఒప్పించాడ‌ని ఇండ‌స్ట్రీ అంతా కోడైకూస్తోంది. ఎన్టీఆర్-బాల‌య్య చివ‌రిసారిగా ఒకే వేధిక పంచుకొని ఎనిమిదేండ్లు గడుస్తోంది. సింహ సినిమా టైంలో బాల‌య్య కోసం ఎన్టీఆర్ రాగా, ఇప్పుడు ఎన్టీఆర్ కోసం బాల‌య్య రాబోతున్నారు. అయితే, ఇది త‌మ‌కు ఓ మంచి అవ‌కాశంగా… బాల‌య్య‌-టీడీపీ బావిస్తోంది. ప‌వ‌న్ టీడీపీని కార్న‌ర్ చేస్తున్న త‌రుణంలో, నంద‌మూరి ఫ్యామిలీ హీరోలంతా ఒకే వేధిక‌ను పంచుకోవ‌టం రానున్న ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా టీడీపీకి లాభం చేస్తుంద‌ని నంద‌మూరి, టీడీపీ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*