ఎల‌క్ష‌న్లు కాదు, క‌నీసం క‌లెక్ష‌న్ల‌ను కూడా ప్ర‌భావితం చేయ‌లేని NOTA

Read Time: 0 minutes

స‌డ‌న్ గా వ‌చ్చి, స్టార్ డ‌మ్ తో సెట్లైన హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌.  అనుకోకుండా వ‌చ్చిన  పెళ్లిచూపుల సినిమా విజ‌యానికి, అర్జున్ రెడ్డి సినిమా తోడు కావ‌టంతో విజ‌య్ కి తిరుగులేకుండా పోయింది. నైజాంలో విజ‌య్ కు విప‌రీత‌మైన స్టార్ డ‌మ్, క్రేజ్ వ‌చ్చేసింది. రాత్రికి రాత్రే… టాప్ హీరో అయిపోయాడు. ఇక ఆ త‌ర్వాత వ‌చ్చిన గీతా గోవిందం సినిమాతో విజ‌య్ రేంజే మారిపోయింది. క‌లెక్ష‌న్ల పంట పండించి, యువ‌త‌ను అట్రాక్ట్ చేశాడు. పైగా సామాజిక అంశాల‌పై కూడా స్పందించే గుణం తోడ‌వ‌టంతో, విజ‌య్ అంటే యూత్ లో పిచ్చ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది.

ఇలాంటి సంద‌ర్భంలో… పైగా ఎన్నిక‌ల సీజ‌న్ లో వ‌చ్చిన సినిమా నోటా. పైగా ట్రైల‌ర్ చూస్తే… యూత్ ఊగిపోయింది. అందుకే కొన్ని పార్టీల నేత‌లు, సినిమా ను బ్యాన్ చేయాల‌న్న స్థాయికి వెళ్లింది. పైగా ఈ సినిమా స్వీయ నిర్మాణంలో చేయ‌టంతో విజ‌య్ కు కూడా ఈ సినిమా ఫ‌స్ట్ టాక్ పై టెన్ష‌న్ పెరిగిపోయింది.

కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు క‌దా. ఫ‌స్ట్ డే నోటా సినిమా ప్లాప్ టాక్ ను తెచ్చుకుంది. అస‌లు నోటా అనే పేరు ఎందుకు పెట్టాల్సి వ‌చ్చిందో అని చ‌ర్చించుకునేలా చేసింది. ఎల‌క్ష‌న్ల‌ను ప్ర‌భావితం చేస్తుంద‌ని భ‌య‌ట నానా రాద్దాంతం అవుతుంటే, ఎల‌క్ష‌న్ల‌ను కాదు, క‌నీసం క‌లెక్ష‌న్ల‌ను కూడా ప్ర‌భావితం చేయ‌లేదు అంటూ ఫ్యాన్స్ నిరూత్సాహ‌ప‌డుతున్నారు. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో, మూడు రాష్ట్రాల్లో విడుదైల ఈ చిత్రం, విడుద‌లైన ప్ర‌తిచోటా వీక్ టాక్ నే సొంతం చేసుకుంది.

నోటా…. తో విజ‌య్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయిన‌ట్లేన‌ని, ఇక నుండైనా… కొంచం జాగ్ర‌త్త‌గా లేకుంటే మొద‌టికే మోసం వ‌స్తుందంటున్నారు సీనీ ఎక్స్ ప‌ర్ట్స్.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*