కాంగ్రెస్ లోకి అగ్ర‌నేత‌లు, పార్టీలో కొత్త జోష్

Read Time: 1 minutes

టీఆరెస్ పార్టీ నాయ‌కుల  ప‌ట్ల ఉన్న చిన్న‌చూపుతో విసిగి వేసారిపోయిన నాయ‌కులంతా కాంగ్రెస్ వైపు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో కాంగ్రెస్ లో భారీగా చేరిక‌లు న‌డుస్తున్నాయి. ద్వితీయ శ్రేణి క్యాడ‌రంతా… కాంగ్రెస్ గెలుపుకోసం ప్ర‌య‌త్నిస్తుంటే, పెద్ద నాయ‌కులు చేరుతుండ‌టంతో… వారి ఉత్సాహం రెట్టింపు అయితుంది.

పీసీసీ మాజీ అద్య‌క్షుడు, సీనీయ‌ర్ నేత‌.. డీ శ్రీ‌నివాస్ తిరిగి కాంగ్రెస్ లో చేర‌బోతున్నారు. కొన్నాళ్లుగా టీఆర్ఎస్ తో అంటీముట్ట‌న‌ట్లుగా ఉన్న డీఎస్… సొంత‌గూటికే రాబోతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. ఇక గ‌జ్వేల్ మాజీ ఎమ్మెల్యే న‌ర్సారెడ్డి, టీడీపీ-బీజేపి కూట‌మి నుండి 2014లో సీఎం అబ్య‌ర్థిగా ఉన్న , ఎల్.బి.న‌గ‌ర్ తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణ‌య్య కూడా కాంగ్రెస్ గూటికి చేర‌బొతున్నారు. కృష్ణ‌య్య బీసీ సంఘం నేత‌గా… ప్ర‌జ‌లంద‌రికీ సుప‌రిచితుడు. ఇక క‌రీంన‌గ‌ర్ జెడ్పీ చైర్మ‌న్ తుల ఉమ కూడా టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్ప‌బోతున్నారు. వీరంతా… శ‌నివారం ఉద‌యం రాహుల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. ఇప్ప‌టికే నాయ‌కులంతా డిల్లీకి చేర‌కుంటున్నారు.

ఇక టీరెఎస్ ఎమ్మెల్సీ రాములు నాయ‌క్ కూడా త్వ‌ర‌లోనే కాంగ్రెస్ గూటికి చేర‌బోతున్నారు. అయితే… ఆయ‌న డిల్లీలో కాకుండా… రాహుల్ రాష్ట్రప‌ర్య‌ట‌న‌లో పార్టీలో చేరుతారంటున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు.

వీరే కాకుండా… నామినేష‌న్ల ప‌ర్వం మొద‌ల‌య్యేనాటికి ఈ చేరిక‌లు మ‌రింత పెరుగుతాయ‌ని, మాజీ మంత్రి గ‌డ్డం వివేక్ స‌హా మ‌రికొంత మంది నేత‌లు కాంగ్రెస్ లోకి చేరేందుకు రెడీ గా ఉన్నారంటున్నాయి గాంధీ బ‌వ‌న్ వ‌ర్గాలు

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*