కాంగ్రెస్ సీట్లు తేలేవ‌ర‌కు టీఆర్ఎస్ అబ్య‌ర్థుల‌ ప్ర‌క‌ట‌న వాయిదా

Read Time: 0 minutes

ప్ర‌బుత్వం ర‌ద్దు చేయ‌గానే, అప‌ద్ద‌ర్మ సీఎంగా… టీఆర్ఎస్ అద్య‌క్షునిగా కేసీఆర్ ఎన్నిక‌ల శంఖ‌రావం పూరించారు. అదే రోజు 105మంది అబ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి, అందిరికీ షాక్ ఇచ్చారు. మిగిలిన అబ్య‌ర్థుల‌ను కూడా వారం,ప‌ది రోజుల్లో ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. కానీ నెల‌లు దాటింది… కానీ అబ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న ఊసే లేదు.

అయితే, కాంగ్రెస్ పార్టీ కూడా ఇంత‌వ‌ర‌కు సీట్ల కేటాయింపులు చేయ‌లేదు. చాలా చోట్ల మ‌హ‌కూట‌మి పార్టీల్లో నాయ‌కులు పోటాపోటీ ప‌డుతున్నా, ఇంకా ఆల‌స్యం అవుతూనే వస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీట్ల కేటాయింపులు చేసేవ‌ర‌కు టీఆర్ఎస్ మ‌లివిడ‌త జాబితా అధికారికంగా విడుద‌ల చేసే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే అనేక ర‌కాల చ‌ర్చ‌లు జ‌రిగినా… అబ్య‌ర్థ‌లు, అక్క‌డి లోకల్ లో ముఖ్య‌మైన నాయ‌కుల‌తో కేసీఆర్ చర్చించినా… ఓ అంచ‌నాకు అయితే వ‌చ్చారు కానీ ప్ర‌క‌ట‌న వ‌ర‌కు వెళ్ల‌టం లేదు.

మ‌హ‌కూట‌మిలో సీట్ల కేటాయింపుల‌పై ఎవైనా పంచాయితీలు జ‌రిగే అవ‌కాశం ఉంది. అలాంటి స‌మ‌యంలో త‌మ అబ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి, చూశారా… మేం ఎంత సామ‌రస్యంగా సీట్ల కేటాయింపు చేశామో, కూట‌మిలో ఇప్పుడున్న ప‌రిస్థితే రేపు ప్ర‌భుత్వంలోకి వ‌స్తే… కూడా ఉంటుంది. రాజ‌కీయ అస్థిర‌త కొత్త రాష్ట్రానికి మంచిది కాద‌న్న వాద‌న‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లె రాజ‌కీయ ఎత్తుగ‌డ కూడా ఉందని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇలాంటి వ్యూహాలు చేయ‌టంలో కేసీఆర్ చురుగ్గా ఉంటారు. చాలా సార్లు ఆయ‌న వేసిన ఇలాంటి స్కేచ్ లు పక్క‌గా వ‌ర్క‌వుట్ అవుతాయి. ఈసారి కూడా అదేవ్యూహాంతో ముందుకెళ్తున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. మొత్తంగా కూట‌మి సీట్లు, అబ్య‌ర్థుల ఖ‌రారు అయ్యేవ‌ర‌కు టీఆర్ఎస్ మ‌లివిడ‌ద జాబితా ఉండ‌కపోవ‌చ్చు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*