కారు డ్రైవ‌ర్ కు ఎమ్మెల్యే సీటు….

Read Time: 0 minutes

సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా ఉండే… మ‌జ్లిస్ పార్టీ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకొని ఔరా అనిపించింది. అయితే… ఇది ఏ విద్వేష‌ర‌క‌మైన స్పీచో, ఇంకేదో కాదు. ఈసారి ఓ ఎమ్మెల్యే అబ్య‌ర్థిగా త‌మ వ‌ద్ద ప‌నిచేసిన కారు డ్రైవ‌ర్ ను నిల‌బెట్ట‌డం.

నిజ‌మే… త్వ‌ర‌లో తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో, ఆయా స్థానాల‌కు అబ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే ప‌నిలో బిజిబిజిగా ఉన్నాయి ఆయా రాజ‌కీయ పార్టీలు. అయితే… గ్రేట‌ర్ ప‌రిధిలో బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉండి, గెలుపోట‌ములు డిసైడ్ చేయ‌గ‌లిగే స్థితిలో ఉండే పార్టీ మ‌జ్లిస్ పార్టీ. అయితే… క్ర‌మక్ర‌మంగా విస్త‌రిస్తున్న ఆ పార్టీ వీలైన‌న్ని ఎక్కువ చోట్ల పోటీ చేయాల‌ని నిర్ణ‌యించింది. అందులో బాగంగా… రాజేంద్ర‌న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్ని మీర్జా ర‌హ్మ‌త్ బేగ్ పేరును ఆ పార్టీ అద్య‌క్షుడు అస‌దుద్దీన్ ఓవైసీ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. అయితే… ఇందులో వింతేమిటి అని అనుకోకండి… ఆ మీర్జా ర‌హ్మ‌త్ బేగ్ గ‌డిచిన రెండున్నర సంవ‌త్స‌రాలుగా… మ‌జ్లిస్ నేత‌ల‌కు డ్రైవ‌ర్ గా ప‌నిచేయ‌టం విశేషం. గ‌తంలో క‌ర్వాన్ ఎమ్మెల్యే ద‌గ్గ‌ర డ్రైవ‌ర్ గా ప‌నిచేసి, అనంత‌రం చార్మినార్ ఎమ్మెల్యే ద‌గ్గ‌ర డ్రైవ‌ర్ గానే ప‌నిచేశారు.  2014 త‌ర్వాత పార్టీలో యాక్టివ్ కార్య‌క‌ర్త‌గా ఉంటున్నారు. దీంతో త‌న‌కు అవ‌కాశం ఇచ్చారు ఓవైసీ సాబ్.

గ‌తంలోనూ… నేత‌ల వ‌ద్ద డ్రైవ‌ర్లుగా ప‌నిచేసి, ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులైన వారు కూడా ఉన్నారు. మ‌రీ… మీర్జా భ‌వితవ్యం ఎలా ఉంటుందో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*