కాసుల వ‌ర్షం కురిపిస్తోన్న బ‌యోపిక్స్… త్వ‌ర‌లో సైనా బ‌యోపిక్.

Read Time: 0 minutes

స్పోర్ట్ స్టార్స్ బ‌యోపిక్స్ ఎంత క్రేజీ ఉంటుందో ఇప్ప‌టికే ప‌లు చిత్రాలు క‌లెక్ష‌న్ల రూపంలో  చూపించాయి. ఇండియా క్రికెట్ టీం కీప‌ర్ ధోనీ, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్, మిల్కాసింగ్, మేరీ కోమ్… ఇలా ఎంద‌రో ఇండియ‌న్ స్పోర్ట్స్ స్టార్స్ బ‌యోపిక్స్ సెన్సెష‌న‌ల్ హిట్ సాధించాయి. బాక్సాఫీస్ లో నిల‌బ‌డి, క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొట్టాయి.

అయితే, ఇప్పుడు ఇదే బ‌యోపిక్ సినిమాలోకి మ‌రో స్టార్ ప్లేయ‌ర్ చేరిపోయారు. బ్యాడ్మింటన్ స్టార్ షెట్ల‌ర్ సైనా నెహ్వ‌ల్ బ‌యోపిక్ త్వ‌ర‌లో సెట్ పైకి వెళ్ల‌నుంది. ఇప్ప‌టికే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. సైనా నేహ్వ‌ల్ పాత్ర‌లో శ్ర‌ద్ధ‌క‌పూర్ న‌టించ‌నున్నారు. ఇప్ప‌టికే సైనా జీవితం, ఆమె ప్రాక్టిస్ ఎలా ఉంటుంది, ఆమె న‌డ‌వ‌డి ఎలా ఉంటుంద‌న్న విష‌యాల‌పై ఆమె నేరుగా సైనాతో, ఆమె కుటుంబంతో కొంత స‌మ‌యాన్ని గ‌డిపిన‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే శ్ర‌ద్ధ సైనా గురువు గోపిచంద్ తో కొన్నిక్లాసులు కూడా నేర్చుకుంద‌ట‌. కానీ ఆమెకు బాగా స‌మ‌యం ప‌డుతుండ‌టంతో, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. అమోల్ గుప్టే ఈసినిమాను డైరెక్ట్ చేయ‌బోతుండ‌గా… గోపిచంద్ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌న్న‌ది ఇంకా స‌స్పెన్స్ గా మారింది. అయితే, సుధీర్ బాబు గోపీ చంద్ పాత్ర చేయ‌బోతున్నార‌ని…. ఇండ‌స్ట్రీ అంటున్నా, ఇంత‌వ‌ర‌కు ఎలాంటి అఫిషీయ‌ల్ అనౌన్స్ చేయ‌లేదు.  మ‌రోవైపు… సైనా బ‌యోపిక్ పై ఇండ‌స్ట్రీ, స్పోర్ట్స్ ల‌వ‌ర్స్ అంతా ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*