కూట‌మి అబ్య‌ర్థులు ఖ‌రార‌య్యే వ‌ర‌కు కేసీఆర్ మౌన‌ముద్రేనా…?

Read Time: 0 minutes

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుంటే… కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు…? అయిన‌దానికి కానిదానికి నోటికి ప‌నిచేప్పే నేత ఎందుకు సైలెంట్ గా చూస్తున్నాడు…?   తెలంగాణ ఎన్నిక‌ల ముఖ‌చిత్రం ఇంకా కేసీఆర్ కు అర్థం కాలేదా లేక స‌రైన స‌మ‌యం కోసం ఎదురు చూస్తున్నాడా…? ఈ స్టోరీ చ‌ద‌వండి.

ఎవ‌రు అవున‌న్న కాదన్నా… కేసీఆర్ ఓ మంచి రాజ‌కీయ వ్యూహ‌ర‌చ‌యిత‌. త‌ను తొంద‌ర‌ప‌డి త‌ప్పులు చేయ‌టం కన్నా, ఎదుటివారు చేసే త‌ప్పుల కోసం వెయిట్ చేస్తూ… వ్యూహాం ర‌చించ‌టం ఆయ‌న నైజం. ఒకేసారి 105 మంది అబ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించినా, ఎన్నిక‌ల కోసం శంఖాల‌ను పూరించినా, హెలిక్యాప్ట‌ర్లు రెడీ చేసుకొని… ప‌క్క‌న పెట్టినా ఆయ‌న‌కే చెల్లింది. ప్ర‌త్య‌ర్థి ఎవ‌రో తెలిస్తే క‌దా… యుద్దం ఎవ‌రిపై చేయాల‌న్న‌దానిపై క్లారిటీ వ‌స్తుంద‌న్న సూత్రంతో సీఎం కేసీఆర్ అలా చూస్తూ… ఫాంహౌజ్ లో ఎప్ప‌టిక‌ప్పుడు లెక్క‌లెసుకుంటున్నారు.

గెల‌వాలి కాదు, గెలిచితీరాల‌న్న క‌సితో ఉన్న ఆయ‌న మ‌హ‌కూట‌మి జాబితా, అబ్య‌ర్థుల ఖ‌రారు కోసం వెయిట్ చేస్తున్నారు. ఖ‌చ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎక్క‌డో ఒక చోట త‌ప్పులో కాలేయేక‌పోదు, నాకు ప్ర‌చారాస్త్రం దొరక్క‌పోదు అన్న చందంగా కాలం గ‌డుపుతున్నాడు. అందుకే… కీల‌క‌మైన వ‌రంగ‌ల్, ఖ‌మ్మం జిల్లాల ప‌ర్య‌ట‌న లు ఖ‌రారైనా, చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్ పెట్టి, వాయిదా వేశాడు. అక్క‌డ కాంగ్రెస్ కూట‌మి బ‌లంగా ఉంద‌ని విష‌యం తెలిసిన ఆయ‌న‌, కూట‌మి అబ్య‌ర్ధుల లిస్ట్ వ‌స్తే… ఇంత‌కు ముందు తిట్టిన దానిక‌న్నా ఎక్కువే తిట్టేందుకు మొగ్గుచూపుతున్న‌ట్లు స‌మాచారం.

ఈవిష‌యం తెలిసి, త‌మ పార్టీలో కూడా అసంతృప్తులు పెర‌గ్గ‌కుండా… వీలైనంత సీక్రెసీ మెయింటెన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందుకే అబ్య‌ర్థుల జాబితా ఆల‌స్యం అన్న వాద‌న‌లు కూడా ఉన్నాయి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*