కూట‌మి ఆర్థిక వ‌న‌రుల టార్గెట్ గానే తాజా ఐటీ దాడులు….?

Read Time: 1 minutes

రాష్ట్రంలో మ‌ళ్లీ ఐటీదాడుల క‌ల‌క‌లం రేపుతోంది. ఉద‌యం నుండే ఈ సోదాలు మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం రాజ‌కీయ నేత‌ల ఇండ్లు, ఆర్థిక లావాదేవీల టార్గెట్ సాగిన ఈ దాడులు, ఇప్పుడు ఆయా పార్టీల‌కు అండ‌గా ఉంటున్నారు అన్న అనుమానం ఉన్న కంపెనీల టార్గెట్ గా సాగుతున్న‌ట్లు ప‌లువురు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో మ‌హ‌కూట‌మికి ఆర్థిక వ‌న‌రులన్నీ టీడీపీ-చంద్ర‌బాబే స‌మ‌కూరుస్తున్నారంటూ… ఇటీవ‌లే కేసీఆర్ ప‌లుమార్లు ఆరోప‌ణ‌లు చేశారు. ఇదే అంశాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని, మ‌ళ్లీ ఆంద్రా చేతిలో కీలుబొమ్మ‌లు చేస్తారంటూ… టీఆర్ఎస్ చేస్తున్న ప్ర‌చారానికి తోడైన‌ట్లే ఐటీ దాడులు క‌న‌ప‌డుతున్నాయంటున్నారు విశ్లేష‌కులు. ఉద‌యం నుండే హైద‌రాబాద్ లో పోల‌వ‌రం నిర్మాణం చేస్తున్న న‌వ‌యుగ కంపెనీ పై దాడులు సాగుతున్నాయి.

ఈ కంపెనీకి అప్ప‌ట్లో… చంద్ర‌బాబు కేంద్రంతో మాట్లాడి మ‌రీ ఆ ప‌నులు అప్ప‌జెప్పార‌న్న ప్ర‌చారం సాగింది. దీంతో అక్క‌డి నుండి అర్థిక వ‌న‌రులు స‌మ‌కూరుతాయ‌నే అనుమానంతోనే…. వారిని క‌ట్ట‌డిచేసేందుకు ఈ ప్ర‌య‌త్నాలు అన్న అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే ఓవైపు టీడీపీ నేత‌ల కంపెనీలే టార్గెట్ గా ఐటీ సోదాలు జ‌రుగుతుండ‌టం, టీర్ఎస్ నేత‌ల కంపెనీల‌ను కాద‌ని… కేవ‌లం టీడీపీ నేత‌ల‌తో చ‌నువుగా ఉండే కాంట్రాక్ట‌ర్ల టార్గెట్ ప‌రిణామాలు సాగుతున్నాయ‌ని సుస్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది.

ఇప్ప‌టికే బీజేపీ క‌త్తిగ‌ట్టి త‌మ మీద ఐటీ-ఈడీ అధికారుల‌ను ఉసిగొల్పుతున్నార‌న్న విమ‌ర్శ‌లు చేస్తున్న త‌రుణంలో, కేసీఆర్-బీజేపీ మైత్రి కోస‌మే… తెలంగాణ‌లో కూడా సోదాలు మొద‌ల‌య్యాయ‌ని టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*