కూట‌మికి కోదండ‌రాం బైబై….

Read Time: 0 minutes

టీఆర్ఎస్ ఓట‌మే ల‌క్ష్యంగా… ఏర్పాటైన కూట‌మి ముణ్నాళ్ల ముచ్చ‌ట‌గానే మిగిలిపోయే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. ఇప్ప‌టికే సీట్ల పంప‌కంపై అనేక స‌మావేశాలు ఏర్పాటు చేసుకున్నా, ఓ అవ‌గాహాన‌కు రాలేక‌పోయారు. కూట‌మిలోని కాంగ్రెస్ మిన‌హా టీడీపీ, టీజెస్, సిపిఐ పార్టీల‌కు సీట్ల కేటాయింపుల‌పై అసంతృప్తులున్నాయి. ముఖ్యంగా టీజెఎస్ ఎక్కువ సీట్లు ఆశిస్తుండ‌టంతో, స‌మస్య జ‌ఠిలం అవుతూ వ‌చ్చింది. టీజెఎస్ కు తోడుగా,  సిపిఐ కూడా మొండిప‌ట్టుకు దిగ‌టంతో కాంగ్రెస్ నేత‌లు కూడా ఏమీ చేయ‌లేని పరిస్థితి ఏర్ప‌డింది.

టీజెఎస్ 12 స్థానాల‌కు త‌క్కువ‌కు ఒప్పుకునేది లేద‌ని, సిపిఐ 20 స్థానాల‌కు త‌క్కువ పోటీచేయ‌బోమ‌ని బీష్మించుకోని కూర్చున్నాయి. టీజెఎస్ అయితే ఓ అడుగు ముందుకేసి, ఈనెల 24న ఆ పార్టీ కార్య‌వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకుంది. అదే రోజు కూట‌మి నుండి బ‌య‌ట‌కు వ‌చ్చే అంశంపై ప్ర‌క‌ట‌న కూడా చేస్తామ‌ని బాహాటంగానే స్ప‌ష్టం చేస్తుండ‌టంతో కూట‌మి ప‌క్షాల‌కు కొంత ఇబ్బందిక‌రంగా మారింది. అయితే, ఆపార్టీకి 7 నుండి 9వ‌ర‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్ అనుకూలంగా ఉంద‌ని కాంగ్రెస్ పార్టీ నేత‌లంటున్నారు. ఇక సిపిఐకి 3 సీట్లకు మించి ఇవ్వ‌లేమ‌ని తేల్చిచెప్పిన‌ట్లు తెలుస్తోంది.  అయితే, కోదండ‌రాం విష‌యంలో ఇంకాస్త వెయిట్ చేయాల‌ని కాంగ్రెస్ చూస్తున్నా… కాంగ్రెస్ నేత‌లే లీకులిస్తూ, కూట‌మి పార్టీల ప‌ట్ల స‌రైన రీతిలో వ్య‌వ‌హ‌రించ‌టం లేద‌ని, మిత్ర ధ‌ర్మం పాటించ‌టం లేద‌ని కోదండ‌రాం పార్టీ నేత‌లు అసంతృప్తిగా ఉన్నారు.

ఈనెల 24వ‌ర‌కు వెయిట్ చేస్తే గానీ, పూర్తిక్లారిటీ రాకున్నా…. కూట‌మి నుండి బ‌య‌ట‌కు వెళ్లేందుకే టీజెఎస్ లోని కోదండ‌రాం మిన‌హా ఇత‌ర నేత‌లంతా ఆస‌క్తిగా ఉన్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*