కూట‌మి గెలుపుకు హ‌రీష్ ప‌రోక్ష మ‌ద్ద‌తు…?

Read Time: 1 minutes

కూటమి గెలుపు కోసం హ‌రీష్ మ‌ద్ద‌తు ఇవ్వ‌డ‌మేంటీ అనుకుంటున్నారా…?   మీకే కాదు, ఇదే డౌట్ చాలామందికి వ‌స్తోంది. కానీ రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎదైనా జ‌ర‌గొచ్చు. ఎలాగైనా జ‌ర‌గొచ్చు. అందులోనూ… హ‌రీష్ రావు లాంటి భ‌విష్య‌త్ ఉన్న నేత‌లు ఖ‌చ్చితంగా, త‌మ మెరుగైన‌ భ‌విష్య‌త్ కోసం ఖ‌చ్చితంగా ఆలోచిస్తారు. ప్ర‌స్తుతం అదే జ‌రుగుతోంది.

2014లో తెలంగాణ వేవ్ తో అదికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్, ఇప్పుడు మ‌రోసారి అధికారం కోసం అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే ఈసారి గెలిస్తే, ఖ‌చ్చితంగా సీఎం గా కేటీఆర్ ప్ర‌మాణం చేయ‌బోతున్నాడు. ఆ విష‌యం అంద‌రికీ తెలిసిందే. కానీ 2001 నుండి పార్టీ కోసం ప‌నిచేసి, చాయ్ క‌ప్పులు అందించే ద‌గ్గ‌ర నుండి పార్టీ అధికారంలోకి వ‌చ్చేంత వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌యాణంలో హ‌రీష్ రోల్ సుస్ప‌ష్టం. కానీ మ‌ద్య‌లో వ‌చ్చి, కేటీఆర్ సీఎం ఎలా అయితాడు అన్న‌ది హ‌రీష్ అబ్యంత‌రం. దీంతో కేటీఆర్ ఒక్క‌సారి సీఎం అయితే… ఇక భ‌విష్య‌త్ లో త‌న‌కు ఆ యోగం ఉండ‌దు అని హ‌రీష్ అనుమానంగా ఉంది.

పైగా కేసీఆర్-కేటీఆర్ లు త‌న‌ను రాజ‌కీయాంగా స‌మాధి చేస్తారు. దీంతో, ఇప్పుడే మేల్కొవాలి అన్న కొంద‌రు కీల‌క నేత‌ల సూచ‌న‌తో, హ‌రీష్ త‌న‌దైన స్టైల్లో రాజ‌కీయం చేస్తున్నారు. పార్టీలో ఉంటూనే, మ‌హ‌కూట‌మి అబ్య‌ర్థుల గెలుపుకు ఇండైరెక్టుగా సూచ‌న‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. త‌ద్వారా… కేటీఆర్ సీఎం కాకుండా అడ్డుకోవ‌చ్చ‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌. అందుకే, ఈమ‌ద్య కేటీఆర్-కేసీఆర్ చేస్తున్నంత‌గా…. హ‌రీష్ నోటికి ప‌నిచెప్ప‌టం లేదు. ప్ర‌చారానికి ప‌ల‌నా చోటుకు వెళ్లండి వెళ్ల‌టం, రావ‌టం వ‌ర‌కే ప‌రిమితమ‌వ‌తున్నారు. నిజంగా హ‌రీష్ రావు మునిప‌టిలా లేడు, ఆయ‌న ప్ర‌చారంకు వ‌స్తే ఆ జోషే వేరుగా ఉండేది. కానీ ఎందుకో ఇప్పుడు అలాంటి డైన‌మిక్ హ‌రీష్ రావు క‌నిపిస్త‌లేడ‌ని సొంత క్యాడ‌రే చ‌ర్చించుకోవ‌టం గ‌మ‌నార్హం.

మొత్తంగా… క‌ల్వ‌కుంట్ల వారి కుటుంబంలో త‌గాదాలు, కూట‌మికి-తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మేలే చేస్తుందంటున్నారు టీఆర్ఎస్ ప్ర‌త్య‌ర్ధులు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*