కేటీఆర్– హ‌రీష్ లే ప్ర‌చార‌క‌ర్త‌లు, చివ‌ర్లోనే కేసీఆర్.

Read Time: 0 minutes

50రోజుల్లో వంద స‌భ‌లు, అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌వ‌ర్ చేస్తా, మీ గెలుపు నా భుజాల‌పై వేసుకుంటా అని చెప్పిన‌ట్లు కేసీఆర్… పూర్తిస్థాయిలో ప్ర‌చారం నిర్వ‌హించే ప‌రిస్థితి క‌న‌ప‌డ‌టం లేదు. కేసీఆర్ కేవ‌లం ఉమ్మ‌డి జిల్లాల్లో వారిగా ఒకే స‌భ‌కు హ‌జ‌రుకాబోతున్న‌ట్లు టీఆర్ఎస్ వ‌ర్గాలంటున్నాయి.

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం తిరిగే బాధ్య‌త‌ను కేసీఆర్… కేటీఆర్, హ‌రీష్ ల‌కు అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది. ఒక్కోక్క‌రు ఒక్కో జిల్లా చొప్పున ఎంచుకొని ప్ర‌చారాల‌కు వెళ్లాల‌ని ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది. మొన్న‌టి వ‌ర‌కు హ‌రీష్ ను పూర్తిగా ప‌క్క‌న పెట్టినా… ఇప్పుడా ఆంక్ష‌లు తాత్కాలికంగా ఎత్తివేశారు. తిరిగి ప్ర‌చారంలోకి హ‌రీష్ కూడా చేరిపోయారు. అయితే, ఈ ఇద్ద‌రు నాయ‌కుల‌ను… కాంగ్రెస్  స‌హ కూట‌మి పార్టీలు బ‌లంగా ఉన్న చోట్ల ప్ర‌చారం చేయాల‌ని సూచించిన‌ట్లు స‌మాచారం. ముందుగా బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్దులున్న చోట వారికి గుక్క‌తిప్పుకోకుండా చేసేలా వారి,వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో విసృత ప్ర‌చారం చేస్తే… అది మ‌న‌కు లాభం చేకూరుతుందని చెప్పి, పంపిన‌ట్లు టీఆర్ఎస్ వ‌ర్గాలు అంటున్నాయి. ఇక నిజ‌మాబాద్ జిల్లాలో మొత్తం ఎంపీ క‌వితకు అప్ప‌జెప్పారు.

అయితే, గ‌తంలో కేసీఆర్ చెప్పిన‌ట్లుగా 50 స‌భ‌లు, 80 స‌భ‌లు అటెండ్ అయ్యే ప‌రిస్థితులు క‌న‌ప‌డ‌టం లేదు. మొద‌ట‌గా ఉమ్మ‌డి జిల్లా కేంద్రాల‌కే ఈ కేసీఆర్ స‌భ‌లు ప‌రిమితం కానున్నాయి. ఆ త‌ర్వాత ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డ్డాక‌, త‌ప్ప‌ని ప‌రిస్థితులుంటే… అప్పుడు సెలెక్ట‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో కేసీఆర్ ప్ర‌చారం చేయ‌బోతున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*