
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఇలా… వరుస పట్టి రెడ్డీ నేతలే టార్గెట్ గా కేసీఆర్ కేసులు పెడుతూ ఇరికిస్తున్నారంటూ… జరుగుతున్న ప్రచారం ఒకవైపు, రెడ్డీ వెలమల పంచాయితీ అంటూ మరోవైపు రకరకాల ప్రచారాలు తెలంగాణలో చక్కర్లు కొడుతున్నాయి. మెజారిటీ నేతలు, ప్రజలు పరిస్థితి చూస్తుంటే… రెడ్డీ సామాజిక వర్గానికి, వెలమ సామాజిక వర్గానికి జరుగుతున్న పంచాయితీలో గెలుపెవరిదో చూడాలి అంటూ ఆసక్తి కనపరుస్తుంటే, ఇప్పుడో రెడ్డీ వర్గం కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు జై కొడుతుంది.
తెలంగాణ ప్రాంతంలో రెడ్లు అధికారానికి దూరమై, అవమానాలు పడుతున్నారన్న బాధతో ఉంటే… ఆంద్రా, రాయలసీమకు చెందిన రెడ్లు మాత్రం కేసీఆర్ చేస్తున్న వాటితో ఎంతో సంతోషంగా ఉన్నారట. తెలంగాణలో రెడ్లు ఎక్కువగా కాంగ్రెస్ వైపు ఉంటే, ఆంద్రప్రదేశ్ రెడ్లంతా జగన్ పార్టీ వైపు ఉన్నారు. ఇందులో అనుమానం లేదు. దీంతో… ఓటుకు నోటు కేసులో… రేవంత్ ను రెడ్ హ్యండెడ్ గా పట్టుకోవటం ద్వారా, చంద్రబాబు చుట్టూ వల పన్నారు. ఇప్పుడు జరుగుతున్న కేసులు కూడా చంద్రబాబును లాగే పనిలో ఉండటంతో… ఆంద్రప్రదేశ్ రెడ్లంతా కేసీఆర్ కు జేజేలు కొడుతున్నారు. రేవంత్ పోతే పోయిండు కానీ, తమ నాయకునికి లైన్ క్లియర్ అయ్యే విధంగా… చంద్రబాబుపాత్రను బయటపెట్టి, అరెస్టు చేస్తే ఆంద్రాలో ఎన్నికల నాటికి తమకు ఎదురే ఉండదని తెగ ఆరాటపడుతున్నారు అక్కడి రెడ్డీ సామాజిక వర్గం నేతలు, ప్రజలు.
ఇక కొంతమంది ఆంద్రా రెడ్డి సామాజిక నేతలు, మరీ ముఖ్యంగా… జగన్ పార్టీ నేతలకు, టీఆర్ఎస్ పార్టీకి, పార్టీ ముఖ్యనేతలతో సత్ససంధాలు కలిగి వున్నారు. దీంతో పేరుకే ఒకటైన ఒకే సామాజిక వర్గం ఇప్పుడు ప్రాంతాల వారిగా, పార్టీల వారిగా విడిపోయింది.
Leave a Reply