కేసీఆర్ పంచిన 7కోట్ల నోట్ల క‌ట్ట‌లు.

Read Time: 0 minutes

కేసీఆర్ పంచిన 7 కోట్ల నోట్ల క‌ట్ట‌లు ఏ ఒక్క‌రికో కాదు. కేసీఆర్ ముందుగా ప్ర‌క‌టించిన 105మంది జాబితాలో దాదాపు 100 మందికి పార్టీ ఫండ్ కింద ఎల‌క్ష‌న్ ఖ‌ర్చుల‌కు ఇచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. మొన్న‌టివ‌ర‌కు కేసీఆర్ కు అత్యంత స‌న్నిహితుడుగా ఉన్న ఎమ్మెల్సీ రాములు నాయ‌క్ చేసిన ఈ తాజా ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి.

కేసీఆర్ త‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన రోజే, 105మంది అబ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. అదే రోజు ఆ అబ్య‌ర్థులంద‌రికీ ఒక్కోక్క‌రికి 7 కోట్ల రూపాయాల‌ను అంద‌జెశారు. పార్టీ త‌రుపున గెలిచిరావాల‌ని వారిని పంపించారు అంటూ రాములు నాయ‌క్ చేసిన ఈ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు రాజ‌కీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలో భారీగా నోట్ల క‌ట్ట‌లు ప‌ట్టుబడుతున్న స‌మ‌యంలో… ఇలాంటి ఆరోప‌ణ‌ల‌పై వెంట‌నే ఈసీ స్పందించి ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని ప్ర‌జాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

అయితే, ఇటీవ‌లే పార్టీ నుండి స‌స్పెండ్ అయిన ఎమ్మెల్సీ రాములు నాయ‌క్… కేసీఆర్ పై గురిపెట్టారు. కేసీఆర్ దళిత‌, గిరిజ‌న వ్య‌తిరేకి అని, అందుకే… బ్ర‌హ్మ‌ణుడైన ప్ర‌ణ‌బ్ రాష్ట్రప‌తి హోదాలో రాష్ట్రానికి వ‌స్తే పాధాబివంద‌నం చేసి, రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రప‌తిగా ఇక్క‌డకు వ‌స్తే… కేవ‌లం న‌మ‌స్కారాల‌తో స‌రిపెట్టార‌ని గుర్తుచేశారు. ఈ వ‌ర్గాలంతా కేసీఆర్ కు వ్య‌తిరేకంగా ప‌నిచేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*