కేసీఆర్ ప‌త్రిక లీల‌లు, స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు

Read Time: 0 minutes

కేసీఆర్ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌… లీల‌లు రోజురోజుకు విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాయి. ఇప్ప‌టికే న‌మ‌స్తే తెలంగాణ అంటే… టీఆరెఎస్ పేప‌రా వ‌ద్దులే అన్న స్థితికి వ‌చ్చేసింది. ఉద్య‌మ సంద‌ర్భంలో… పేప‌ర్ కోసం ఎదురుచూసి, పోటీప‌డిన వారే ఇప్పుడు పెద‌వి విరుస్తున్నారు. స‌రే ఇది డిఫ‌రెంట్ ఇష్యూ.

కొంత‌కాలం క్రితం… స‌ర్కార్ ఇచ్చిన  పేప‌ర్ ప్ర‌క‌ట‌న కూడా అనేక విమ‌ర్శ‌ల పాల‌య్యింది. ఒకే భార్య కానీ ఇద్ద‌రు భ‌ర్త‌ల‌తో వేర్వేరు ప‌త్రిక‌ల‌కు యాడ్స్ ఇచ్చారు. దీంతో స‌ద‌రు లేడీ బ‌హిరంగంగానే త‌ప్పుప‌ట్టినా, అప్పుడు ఏజెన్సీపై నెట్టేసి చెతులు దులుపుకోగా, తాజాగా న‌మ‌స్తే తెలంగాణ చేసిన నిర్వాకం మీడియా స‌ర్కిళ్ల‌లోనే కాదు…. ఎంత తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ‌ప‌ట్టించాల‌నుకుందో బ‌య‌ట‌పెట్టింది.

వ్య‌క్తి ఒక్క‌డే, కానీ అభిప్రాయాలు రెండు. వేర్వేరుగా ప్ర‌చురిస్తే ఎవ‌రూ చూడ‌రు… కేసీఆర్ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించారు అనుకుంటారు అనుకున్న గుడ్డి ఆలోచ‌న ఇది. పిల్లి కండ్లు మూసుకొని పాలు త్రాగుతూ, న‌న్నెవ‌రూ చూస్తలేరు అనుకున్న చందంగా ఉంది. కేసీఆర్… ఇటీవ‌ల త‌మ మ్యానిఫెస్టోలో ప్ర‌త్యేక రెడ్డీ కార్పోరేష‌న్ ఏర్పాటు చేసి, నిధులు కేటాయిస్తామ‌ని హ‌మీ ఇచ్చారు. రెడ్డీ కార్పోరేష‌న్ తో పాటే వైశ్య కార్పోరేష‌న్ హ‌మీ కూడా ఇచ్చారు. దీంతో ప్ర‌క‌ట‌నకు డబ్బాకొట్టేందుకు రెడీ అయిన న‌మ‌స్తే తెలంగాణ‌… ఒకే వ్య‌క్తి  ఫోటోకు వేర్వేరు పేర్లు త‌గిలించి, త‌మ‌కు న‌చ్చిన క‌హ‌నీ రాసేసుకుంది.

దీనిపై మీడియా ప్ర‌తినిధులు, ప్ర‌జాసంఘాలు మండిప‌డుతున్నాయి. మీడియా అంటే వాచ్ డాగ్స్ లా ఉండాలి… కానీ య‌జ‌మాని వ‌స్తే డాగ్ లా కాదు అంటూ ఫైర్ అవుతున్నాయి. ఇలాంటి క‌ల్ల‌బొల్లి రాత‌ల‌తో జ‌నాన్ని ఎందుకు మాయ చేయ‌టం అని నిల‌దీస్తున్నాయి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*