కేసీఆర్ ఫార్మూలాను త‌న‌కే తిప్పికొట్టిన కాంగ్రెస్

Read Time: 0 minutes

చేసిన త‌ప్పుకు శిక్ష అనుభవించాల్సిందేన‌న్న‌ట్లు… కేసీఆర్ చేసిన మోసాన్ని, వ‌డ్డీతో సహ తిరిగిచ్చేసింది కాంగ్రెస్ పార్టీ. తన పార్టీ నుండి గెలిచిన ఎంపీని, పార్టీలో చేర్చుకొని… అన‌ర్హ‌త వేటు ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డ కేసీఆర్ కు అదే ఫార్మూలాను అప్లై చేసింది. డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. చేరాడా… అంటే చేరాడు, కానీ ఆయ‌న త‌న నోటి నుండి చేరాను అని చెప్ప‌డు. ఇప్పుడిదే ట్విస్టు.

తాను అధికారికంగా చేరాను అని ఒక్క మాట చేప్పినా, చేరిన‌ట్లు కండువాతో ద‌ర్శ‌న‌మిచ్చినా… డీఎస్ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి ఎస‌రు వ‌స్తుంది. అన‌ర్హ‌త వేటు కోసం రాజ్య‌స‌భ చైర్మన్ వెంకయ్య‌నాయుడుపై ఒత్తిడి తెస్తుంది. అందుకే… ఆ అవ‌కాశం ఇవ్వ‌కుండా… మ‌ర్యాద‌పూర్వ‌కంగా రాహుల్ స‌మ‌క్షంలో డీఎస్ కాంగ్రెస్ లో చేరిన‌ట్లే. బ‌య‌ట‌కు చెప్ప‌టం లేదంతే. గ‌తంలో కాంగ్రెస్ ఎంపీ గా గెలిచిన గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి త‌ర్వాత టీఆర్ఎస్ లో చేరారు. కానీ ఎక్క‌డా గులాబీ కండువా క‌ప్పుకోరు. ఎందుకంటే… కాంగ్రెస్ కు ఫిర్యాదు చేసే అవ‌కాశం ఎందుకు ఇవ్వాలి అన్న‌ది వారి ఆలోచ‌న‌. వారు చూపిన దారే ఇప్పుడు కాంగ్రెస్ కు ప‌నికొచ్చింది. మా ఎంపీని తీసుకుంటే… మీ ఎంపీ వ‌చ్చాడు, చెల్లుకు చెల్లు అన్న‌ట్లు అయింది ప‌రిస్థితి.  పార్టీ వ్య‌తిరేక కార్యాక‌ల‌పాలు అంటూ… ఎంతో మంది మీద చ‌ర్య‌లు తీసుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ, డీఎస్ పై కూడా ఎప్పుడో స‌స్పెండ్ అనేది. ఎంపీ పోస్టు కోస‌మే ఇన్నాళ్లుగా వెయిట్ చేస్తుంది.

ఎప్పుడు డీఎస్ పార్టీ కండువా క‌ప్పుకుంటాడు, వేటు వేయిద్దామా అని కాచుకొని కూర్చున్న టీఆర్ఎస్ నాయ‌కుల‌కు ఇదీ ఓ ర‌కంగా షాకింగ్ న్యూసే.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*