గ‌జ్వేల్ టీఆర్ఎస్ కు షాక్, ఫ‌లించిన ఉత్త‌మ్ మంత్రాంగం.

Read Time: 0 minutes

గ‌జ్వేల్ టీఆర్ఎస్ కు అనుకున్న‌ట్లుగానే… భారీ షాక్ త‌గిలింది. గ‌జ్వేల్ నుండి కేసీఆర్ కు తీవ్ర పోటీ ఇస్తున్న ఒంటేరు ప్ర‌తాప్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే న‌ర్సారెడ్డి మ‌ద్ద‌తు త‌ప్ప‌ద‌ని గ్ర‌హించిన ఉత్త‌మ్… వెంట‌నే రంగంలోకి దిగారు. న‌ర్సారెడ్డితో వ‌రుస భేటీలు చేసి ఒప్పించి స‌ఫ‌లీకృతుడ‌య్యారు.

2009 నుండి 2014వ‌రకు గ‌జ్వేల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ లో ప‌నిచేశారు న‌ర్సారెడ్డి. 2014లో న‌ర్సారెడ్డి భారీగా ఓట్లు చీల్చ‌టంతోనే కేసీఆర్ ఓట‌మి నుండి గ‌ట్టేక్కారు. దీంతో ఈసారి ఆ చాన్స్ ఇవ్వోద్ద‌ని పక‌బ్బందీ వ్యూహం ర‌చించిన ఉత్త‌మ్… న‌ర్సారెడ్డిని పార్టీ మారేందుకు అన్నీ ప్ర‌య‌త్నాలు చేశారు. న‌ర్సారెడ్డి ఇంటికి స్వ‌యంగా వెళ్లి… మ‌రీ పార్టీలోకి ఆహ్వ‌నించారు. పీసీసీ అద్య‌క్షుడి హోదాలో… న‌ర్సారెడ్డి ఇంటికి ఉత్త‌మ్ వెళ్ల‌టం సంచ‌ల‌నంగా మారినా, పార్టీ కోసం ఉత్త‌మ్ తీవ్రంగా కృషిచేసిన‌ట్లు గ‌జ్వేల్ కాంగ్రెస్ నాయ‌కులు అంటున్నారు.

ఇక ఓంటేరు ప్రతాప్ రెడ్డి విజ‌యాన్ని ఎవ‌రూ అడ్డుకోలేర‌ని, గ‌జ్వేల్ లో ముఖ్యమంత్రికి ఓట‌మి త‌ప్ప‌దంటున్నారు స్థానిక జ‌నం. గ‌త 30 ఏండ్లుగా ప్ర‌త్య‌ర్థులుగా ఉండి, కేసీఆర్ ను ఓడించేందుకు చేతులు క‌లుప‌టంతో… గజ్వేల్ రాజ‌కీయాలు రంజుగా మారాయి

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*