చివ‌రి ద‌శ‌కు కూట‌మి పొత్తులు, ఆ రెండు పార్టీలు ఔట్

Read Time: 1 minutes

రాష్ట్రంలో కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దెదింప‌ట‌మే లక్ష్యంగా జ‌ట్టుక‌ట్టిన విపక్షాల ఐక్య‌త ముణ్ణాల్ల ముచ్చ‌ట‌గానే మిగిలిపోనుంది. కూట‌మిలోని పక్షాలైన‌… కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్, సిపిఐల్లో టీజెఎస్, సిపిఐలు బ‌య‌ట‌కు రాబోతున్నాయి. ఇప్ప‌టికే టీటీడీపీ నేత‌ల‌తో భేటీ అయిన చంద్ర‌బాబు, ఇత‌ర పార్టీల‌తో సంబందం లేకుండా… మ‌నం కాంగ్రెస్ తోనే వెళ్ల‌బోతున్నామ‌ని, సీట్ల సంఖ్య బెట్టువ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు.

మ‌రోవైపు గ‌తంలో సీట్ల సంఖ్య స‌మ‌స్యే కాద‌ని వాదించిన సిపిఐ, టీజెఎస్ లు చివ‌ర‌కు సీట్ల స‌మ‌స్య‌తోనే బ‌య‌ట‌కు వెళ్లేందుకు రంగం సిద్ధ‌మ‌యింది. చెరో 15కు పైగానే సీట్లను కేటాయించాల‌ని కోరుతుండ‌టం, ఎంత‌కు బెట్టు వీడ‌కపోవ‌టంతో… కూట‌మి విచ్చిన్నం త‌ప్ప‌ద‌ని పండితులు విశ్లేషిస్తున్నారు. సిపిఐ అయితే బిచ్చం వేస్తున్నారా అంటూ బ‌హిరంగ విమ‌ర్శ‌ల‌కు దిగింది. మ‌రోవైపు… ఒంట‌రి పోరుకు వెళ్దాం లేదంటే, బీజేపీతో అయిన జ‌త క‌డుదాం అంటూ కోదండ‌రాం పై ఆయ‌న పార్టీ అనుచ‌రులు ఒత్తిడి తెస్తున్నారు. మ‌రోవైపు వీరి డిమాండ్ల‌కు కాంగ్రెస్ పార్టీ కూడా సానుకూలంగా లేర‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో… చివ‌ర వర‌కు వెయిట్ చేసి, దిగివ‌స్తే రాని లేక‌పోతే పోనీ… అని కాంగ్రెస్, టీడీపీలు డిసైడ‌యిన‌ట్లు తెలుస్తోంది.

అయితే, ఎట్టిప‌రిస్థితుల్లోనూ… ఏ పార్టీ క‌లిసివ‌చ్చినా, లేకున్నా…  టీడీపీ-కాంగ్రెస్ లు క‌లిసే వెళ్ల‌బోతున్నాయి. ఈనెల 24లోపు కూట‌మిలో ఎన్ని పార్టీలు ఉంటాయో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉండ‌గా, ఈనెల 27న కూట‌మి అబ్య‌ర్థుల  తొలి జాబితా విడుద‌ల చేసేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*